విజ‌య్ ఎఫెక్ట్‌.. ఓటీటీలో దూసుకెళుతోన్న‌ 'భగవంత్ కేసరి'

by velandi.Saikiran |   (  Updated:2026-01-05 05:08:54  IST  )

భగవంత్ కేసరి సినిమాకు రీమేక్ గా ఈ జన నాయకుడు వస్తోందని టాక్ నడుస్తోంది. దాదాపు రూ. 4.5 కోట్లు పెట్టి మరీ, భగవంత్ కేసరి రీమేక్ హక్కులను నిర్మాణ సంస్థ కెవిన్ ప్రొడక్షన్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో భగవంత్ కేసరి సినిమా ట్రెండింగ్ లోకి వచ్చిందని టాక్.

విజ‌య్ ఎఫెక్ట్‌.. ఓటీటీలో దూసుకెళుతోన్న‌ భగవంత్ కేసరి
X

దిశ‌, వెబ్ డెస్క్‌: దళపతి విజయ్ కారణంగా నందమూరి బాలయ్య నటించిన సినిమా ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చింది. 2023లో నందమూరి బాలయ్య భగవంత్ కేసరి ( Bhagavanth Kesari) సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో బంపర్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కూడా అయింది. ఈ మూవీ రిలీజ్ అయి దాదాపు మూడు సంవత్సరాలు అయినప్పటికీ, ఇప్పుడు భగవంత్ కేసరి సినిమా ట్రెండింగ్ లోకి వచ్చింది. జనాలు ఎగబడి మరి ఈ సినిమాను ప్రైమ్ వీడియోలో చూస్తున్నారు.

దీనంతటికి కారణం దళపతి విజయ్. ఆయన లేటెస్ట్ గా చేసిన సినిమా జన నాయకుడు. భగవంత్ కేసరి సినిమాకు రీమేక్ గా ఈ జన నాయకుడు వస్తోందని టాక్ నడుస్తోంది. దాదాపు రూ. 4.5 కోట్లు పెట్టి మరీ, భగవంత్ కేసరి రీమేక్ హక్కులను నిర్మాణ సంస్థ కెవిన్ ప్రొడక్షన్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో భగవంత్ కేసరి సినిమా ట్రెండింగ్ లోకి వచ్చిందని టాక్. ఏదైతేనేం.. విజయ్ కారణంగా బాలకృష్ణ సినిమాను మాత్రం జనాలు ఎగబడి చూస్తున్నారు.

Read More..

విజ‌య్ ఫ్యాన్స్ ఓవ‌రాక్ష‌న్‌..పరాశక్తి మూవీ బ్యానర్లు చింపేసి ర‌చ్చ !

Next Story