థ్రిల్లింగ్ డ్రామాతో జమానా

by Sujitha Rachapalli |

సూర్య శ్రీనివాస్‌, సంజీవ్‌ కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జమాన’. భాస్కర్‌ జక్కుల దర్శకుడిగా పరిచయమవుతుండగా.. తేజస్వి అడప, బొద్దుల లక్ష్మణ్‌, శివకాంత్, శశికాంత్ నిర్మాతలు. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా

థ్రిల్లింగ్ డ్రామాతో జమానా
X

దిశ, సినిమా : సూర్య శ్రీనివాస్‌, సంజీవ్‌ కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జమాన’. భాస్కర్‌ జక్కుల దర్శకుడిగా పరిచయమవుతుండగా.. తేజస్వి అడప, బొద్దుల లక్ష్మణ్‌, శివకాంత్, శశికాంత్ నిర్మాతలు. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరగ్గా.. చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన డైరెక్టర్..‘‘జమాన’ డిఫరెంట్‌గా ఉంటుంది. మంచి థ్రిల్లర్ సబ్జెక్ట్‌తో తెరకెక్కించాం. సినిమా ఆద్యంతం వినోదంతో పాటు ఊహించని ట్విస్ట్‌లు ఉంటాయి’ అని తెలిపాడు. ఈ చిత్రాన్ని దర్శకుడు భాస్కర్ చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో నడిపించారన్న నిర్మాత.. సినిమా తప్పకుండా అందరిని అలరిస్తుందని నమ్ముతున్నట్లు చెప్పాడు. హీరో సూర్య శ్రీనివాస్, సంజీవ్ కుమార్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ...‘కష్టపడి చేసిన జమాన సినిమా జనవరి 30న థియేటర్స్‌లో విడుదల కాబోతోంది. మీ అందరికి నచ్చుతుందని నమ్ముతున్నాం’ అన్నారు. ఇక హైదరాబాద్ పాతబస్తీ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలో స్వాతి కశ్యప్‌, జారా తదితరులు నటిస్తున్నారు.

Next Story