- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆరోజు 'జైలర్ 2' రిలీజ్?
'జైలర్ 2' చిత్రాన్ని జన్మాష్టమి సందర్భంగా సెప్టెంబర్ 4వ తేదీన విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం ‘జైలర్ 2’ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. 2023లో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ‘జైలర్’ చిత్రానికి ఇది కొనసాగింపుగా రూపొందుతోంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా విడుదల తేదీపై అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటివరకు రాలేదు. అయితే తాజాగా ఈ మూవీ రిలీజ్‌కు సంబంధించిన ఓ వార్త కోలీవుడ్ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది.
ఈ చిత్రాన్ని జన్మాష్టమి సందర్భంగా సెప్టెంబర్ 4వ తేదీన విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మరో రెండు, మూడు రోజుల్లో వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కలానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి, ఎస్.జె. సూర్య, రమ్య కృష్ణన్, యోగి బాబు, మీర్నా, అన్నా రాజన్, జతిన్ సర్నా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.






