రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి వేడుకలు.. జాగృతి అధ్యక్షురాలు కవిత సందడి

by Ramesh Naini |

ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగింది.

రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి వేడుకలు.. జాగృతి అధ్యక్షురాలు కవిత సందడి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగింది. హైద‌రాబాద్‌లో ఇవాళ తెల్లవారుజామున తన ప్రియురాలు హరిణ్య రెడ్డి మెడలో మూడు ముళ్లు వేసి వివాహ బంధంలో అడుగుపెట్టారు. వీరి వివాహానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ క్రమంలోనే వీరి వివాహానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, కల్వకుంట్ల కవిత హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు ఆశీర్వాదం అందించారు.

అనంతరం పెళ్లిలో కల్వకుంట్ల కవితతో అభిమానులు, బంధువులు సెల్ఫీలు దిగారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు నెటిజన్లు రాహుల్ సిప్లిగంజ్ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా, టాలీవుడ్ సిని పరిశ్రమలో సింగర్‌గా రాహుల్ సిప్లిగంజ్ ఎంతో బిజీగా ఉన్నారు. అతను పాడిన నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో ఇండస్ట్రీలో రాహుల్ క్రేజ్ మరింత పెరిగింది. వీడియో ఇదే..

Next Story