Jagapathi Babu: ప్రభాస్ పెట్టిన ఫుడ్ కి జై భీమవరం అంటూ వీడియో షేర్ చేసిన జగపతి బాబు

by Prasanna |
Jagapathi Babu: ప్రభాస్ పెట్టిన ఫుడ్ కి జై భీమవరం అంటూ వీడియో షేర్ చేసిన జగపతి బాబు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రభాస్ ( Prabhas) స్థానం వేరు. పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ ఎలాంటి గర్వం లేకుండా అందరితో చాలా సరదాగా మాట్లాడుతుంటాడు. డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మారుతీ దర్శకత్వంలో రాజా సాబ్, హను రాఘవపూడి సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. ప్రభాస్ తో ఎవరు వర్క్ చేసిన ఒకటే మాట చెబుతారు.. ఫుడ్ తోనే చంపేస్తాడంటూ అంటుంటారు. డార్లింగ్ సినిమాలలో వర్క్ చేసిన హీరోయిన్స్ శ్రద్ద కపూర్, దీపికా, మాళవికా మోహనన్ వీరందరూ ప్రభాస్ పెట్టె ఫుడ్ గురించి కామెంట్స్ చేశారు.

అయితే, తాజాగా జగపతి బాబు ( Jagapathi Babu) ప్రభాస్ తనకి పంపించిన ఫుడ్ ని ఓ వీడియోని తీసి ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. బ్యాక్ గ్రౌండ్ " వివాహ భోజనంబు" అంటూ పాటను యాడ్ పోస్ట్ చేశాడు. " ఎవరు చెప్పొద్దూ, చెబితే తాను పెట్టే ఫుడ్ తో ఈ బాబు బలి.. అదీ బాహుబలి లెవల్.. పందికొక్కులాగా తిని ఆంబొతులాగా పడుకుంటున్నాను అంటూ ప్రభాస్ తనకు పంపించిన ఫుడ్ ఐటమ్స్ అన్ని ఆ వీడియోలో షేర్ చేస్తూ జై భీమవరం జై ప్రభాస్ " అంటూ సోషల్ మీడియాలో పెట్టిన వీడియో వైరల్ గా మారింది.


Advertisement

Next Story

Most Viewed