- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jacqueline Fernandez: ఆ విషయంలో అక్షయ్ కుమార్ నుంచి చిట్కాలు తీసుకోవాలి.. అలాంటి వీడియో షేర్ చేస్తూ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పోస్ట్
స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రజెంట్ వరుస చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.

దిశ, సినిమా: స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రజెంట్ వరుస చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హౌస్‌ఫుల్ 5’. ఫుల్ కామెడీ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ మూవీకి తరుణ్ మన్సుఖాని దర్శకత్వం వహిస్తున్నాడు. నాడియాద్వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్మెంట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై సాజిద్ నడియాద్వాలా, వార్దా నదియాద్వాలా అండ్ ఫిరూజీ ఖాన్ నిర్మిస్తున్నారు. ఇందులో అక్షయ్ కుమార్‌తో పాటు రితేష్ దేశ్‌ముఖ్, అభిషేక్‌బచ్చన్, సంజయ్‌దత్, ఫర్దీన్ ఖాన్, నానాపటేకర్, జాకీష్రాఫ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
ఈ మూవీ భారీ అంచనాల మధ్య జూన్ 6న థియేటర్స్‌లో గ్రాండ్ రలీజ్‌కు సిద్ధం అవుతోంది. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు చిత్ర బృందం. ఇందులో భాగంగానే జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన టీమ్‌తో ఎంజాయ్ చేస్తున్న వీడియో షేర్ చేస్తూ.. ‘అక్షయ్ కుమార్‌ను చూసి నా డ్యాన్స్‌ను నేను మెరుగుపరచుకోవాలి.. దీని కోసం ఆయన నుంచి కొన్ని చిట్కాలు పొందాలి.. హౌస్‌ఫుల్ 5 వచ్చేస్తుంది.. మీరు కూడా చూసి నేర్చుకోండి’ అంటూ ఓ వీడియో షేర్ చేసింది.
I need to improve my Phoogdi dance skills for sure.. @akshaykumar need to get some tips from you for sure! Houseful 5 advance bookings open now!!! ❤️❤️ pic.twitter.com/y2C5IozsI4
— Jacqueline Fernandez (@Asli_Jacqueline) June 2, 2025






