ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ వాయిదా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థపై కేసు నమోదు

by Chukka Sudharani |

ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ వాయిదా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థపై కేసు నమోదు
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘ది రాజాసాబ్’. హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా పలుసార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల డిసెంబర్ 5న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ డేట్‌కు కూడా సినిమా థియేటర్‌లోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఈ క్రమంలోనే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థపై IVY ఎంటర్‌టైన్మెంట్స్ కేసు పెట్టింది. పీపుల్ మీడియా సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ‘ది రాజాసాబ్’ సినిమాకు ముంబైకు చెందిన IVY ఎంటర్‌టైన్మెంట్స్ ఆర్థిక భాగస్వామిగా వ్యవహరిస్తోంది. షూటింగ్‌కు అయ్యే ఖర్చు నుంచి తదితర ఆర్థిక వనరులు సమకూర్చేలా ఇరు సంస్థలు ఒప్పందం కుదుర్చుకోగా.. అనుకున్న టైంమ్‌కు రాజాసాబ్ షూటింగ్ కంప్లీట్ చేయలేదని ఆ సంస్థ సీరియస్ అయ్యింది.

దీంతో షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయకపోవడమే కాకుండా తమకు ఎలాంటి ఇన్‌ఫర్మెషన్ ఇవ్వలేదంటూ ఢిల్లీ కోర్టులో కేసు నమోదు చేసింది IVY ఎంటర్‌టైన్మెంట్స్. అలాగే మేము ఇచ్చిన డబ్బులో రూ. 218 కోట్లు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. అయితే.. దీనిపై స్పందించిన పీపుల్ మీడియా సంస్థ ‘ది రాజాసాబ్’కు సంబంధించిన నాన్-థియేట్రికల్ డీల్ ఇంకా క్లోజ్ కాలేదని, అనుకోని కారణాల చేత సినిమా వాయిదా పడిందని, కావాలని తమ పరువుకు భంగం కలిస్తున్నారనటి IVY ఎంటర్‌టైన్మెంట్స్‌పై కోర్టును ఆశ్రయించింది. మరి ఈ వివాదం ఎప్పటికి ముగుస్తుందో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతుండగా.. అసలే సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మధ్యలో ఇదేంటిరా బాబు.. ఇప్పుడు ఇది ఇంకాస్త లేటు అవుతుందా ఏంటీ అంటూ నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. లింక్


Next Story