కర్నూలులో ఘనంగా ‘ఇట్స్ ఓకే గురు’ ట్రైలర్ ఆవిష్కరణ

by Sujitha Rachapalli |

మణికంఠ దర్శకత్వంలో సురేష్ అనాపురపు మరియు బస్వా గోవర్ధన్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'ఇట్స్ ఓకే గురు' (It's Ok Guru). సాయి చరణ్, ఉష

కర్నూలులో ఘనంగా ‘ఇట్స్ ఓకే గురు’ ట్రైలర్ ఆవిష్కరణ
X

దిశ, సినిమా : ​మణికంఠ దర్శకత్వంలో సురేష్ అనాపురపు మరియు బస్వా గోవర్ధన్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఇట్స్ ఓకే గురు’. సాయి చరణ్, ఉష శ్రీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక కర్నూలులో ఘనంగా జరిగింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న చిత్రం డిసెంబర్‌లో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైంది. డా. కె.వి. సుబ్బారెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ రాజ్యసభ సభ్యులు టి.జి. వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ట్రైలర్‌ విడుదల చేశారు. కాలేజ్ చైర్మన్ డా. కె.వి. సుబ్బారెడ్డి , చిత్ర యూనిట్ సభ్యులు, క్రాంతి ప్రసాద్, రాజీవ్, నారప్ప వెంకటేష్, రాహుల్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేల మంది విద్యార్థుల సమక్షంలో ‘Say NO to Drugs & YES to Life’ స్పెషల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

Next Story