- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇట్స్ అఫీషియల్.. నాలుగేళ్ల తర్వాత ఓటీటీలోకి రాబోతున్న మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
మలయాళ స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్(Fahad Fazil) ప్రధాన పాత్రలో నటించిన మిస్టరీ థ్రిల్లర్ సినిమా ‘ఇరుల్’(Irul).

దిశ, సినిమా: మలయాళ స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్(Fahad Fazil) ప్రధాన పాత్రలో నటించిన మిస్టరీ థ్రిల్లర్ సినిమా ‘ఇరుల్’(Irul). దర్శన్ రాజేంద్రన్(Darshan Rajendran), సౌబీన్ షాహిర్ కీలక పాత్రలో నటించిన ఈ మూవీకి నసీఫ్ యూసఫ్ ఇజుద్దీన్(Seif Yusuf Izzuddin) దర్శకత్వం వహించారు. అయితే సునీల్ యాదవ్ కథ అందించారు. ఓ ప్రేమజంట జీవితంలోకి ఓ సీరియల్ కిల్లర్ ఎలా వచ్చాడు? అబద్ధానికి, నిజానికి మధ్య నెలకొన్న సంఘర్షణలో ఆ ప్రియురాలు ఎలాంటి నిర్ణయం తీసుకుందనే కథతో వచ్చింది. అయితే ఈ సినిమా కోవిడ్ కారణంగా డైరెక్టర్‌గా 2021లో నెట్‌ఫ్లిక్స్‌లో మలయాళ వెర్షన్ విడుదల బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అయితే కేవలం 91 నిమిషాల నిడివి ఉన్న ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా, సూపర్ హిట్ చిత్రం ‘ఇరుల్’ తెలుగు వెర్షన్ ఓటీటీలోకి రాబోతుంది.
ఈ విషయాన్ని తెలుపుతూ ప్రముఖ సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘అపరాది’ (Aaparadhi)పేరుతో ఈ సినిమా ఓటీటీ సంస్థ ఆహాలో మే 8 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతుంది. అయితే విడుదలైన నాలుగేళ్ల తర్వాత రాబోతుండటం గమనార్హం. ఇక ఈ పోస్ట్‌కు ‘‘ఒక ఇల్లు... ముగ్గురు వ్యక్తులు.. అంతులేని అనుమానం’’ అనే క్యాప్షన్ జత చేశారు. అంతేకాకుండా ఫహాద్ ఫాజిల్ ఫోన్ మాట్లాడుతున్న పోస్టర్‌ను షేర్ చేశారు. కాగా, ఫహాద్ సినిమాల విషయానికొస్తే.. గత ఏడాది ‘పుష్ప-2’ చిత్రంతో బ్లాక్ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం మలయాళంలో వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఓకే నిర్మాణ సంస్థపై రెండు భారీ ప్రాజెక్ట్స్ చేయనున్నారు. అయితే షూటింగ్స్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీస్ త్వరలోనే విడుదల కాబోతున్నాయి.






