ఇట్స్ అఫీషియల్: కుబేర రిలీజ్ డేట్ ఫిక్స్.. హైప్ పెంచుతున్న పోస్టర్.. ట్వీట్ వైరల్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-02-27 11:44:49  IST  )

అక్కినేని నాగార్జున(Nagarjuna), ధనుష్(Dhanush), రష్మిక మందన్న(Rashmika Mandanna) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కుబేర'(Kubera).

ఇట్స్ అఫీషియల్: కుబేర రిలీజ్ డేట్ ఫిక్స్.. హైప్ పెంచుతున్న పోస్టర్.. ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని నాగార్జున(Nagarjuna), ధనుష్(Dhanush), రష్మిక మందన్న(Rashmika Mandanna) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కుబేర'(Kubera). దీనికి ‘ఆనంద్‌’(Anand), ‘గోదావరి’(Godavari), ‘హ్యాపీడేస్‌’(Happy Days), ‘ఫిదా’(Fidaa) వంటి క్లాసిక్ సినిమాలు తీసిన శేఖర్‌ కమ్ముల(Shekhar Kammula) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అయితే ఏషియ‌న్ సినిమాస్ అధినేత సునీల్‌ నారంగ్, పుస్కుర్‌ రామ్మోహన్‌రావుతో కలిసి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాడు.

ఈ పాన్‌ ఇండియా చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌(DeviSri Prasad) సంగీతం అందిస్తున్నాడు. ఇక ఇప్ప‌టికే మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ఆకట్టుకుని సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచగా.. తాజాగా చిత్ర‌బృందం విడుద‌ల తేదీని ప్ర‌క‌టించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ఈ సినిమాను జూన్ 20న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. కాగా ముంబై బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ సినిమాలో ధ‌నుష్ బిచ్చ‌గాడి పాత్ర‌ల్లో క‌నిపించ‌నుండ‌గా.. నాగార్జున బిజినెస్ టైకున్ పాత్ర‌లో మెర‌వ‌బోతున్నాడు.

ఇక పోస్టర్‌ను గమనించినట్లయితే.. నాగార్జున, ధనుష్‌లు ఎదురెదురుగా ఉండగా మధ్యలో బాలీవుడ్ నటుడు జిమ్ షర్బ్ కనిపిస్తున్నారు. అయితే దీన్ని బట్టి చూస్తే ఈ మూవీ భిన్నమైన డ్రామా కథాంశంతో తెరకెక్కుతున్నట్లు అర్థమవుతోంది.

Next Story