ఇట్స్ అఫీషియల్.. ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న అనగనగా ఒక రాజు.. పోస్ట్ వైరల్

by I. Sairam |   (  Updated:2026-02-08 07:05:00  IST  )

మిస్‌ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తాజాగా న‌వీన్ పొలిశెట్టి (Naveen Polishetty) అన‌గ‌న‌గా ఒక రాజు (Anaganaga Oka Raju) మూవీకు మన ముందుకు వచ్చాడు.

ఇట్స్ అఫీషియల్.. ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న అనగనగా ఒక రాజు.. పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: మిస్‌ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తాజాగా న‌వీన్ పొలిశెట్టి (Naveen Polishetty) అన‌గ‌న‌గా ఒక రాజు (Anaganaga Oka Raju) మూవీకు మన ముందుకు వచ్చాడు. ఈ సినిమాకు మారి(Mari) ద‌ర్శ‌క‌త్వం వ‌హించగా.. సితార ఎంట‌ర్‌టైన్ మెంట్స్ నిర్మించిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి(Meenakshi Choudary) హీరోయిన్‌గా నటించింది. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో వస్తోన్న ఈ చిత్రాన్ని ఫార్చ్యూన్ ఫోర్‌ సినిమాస్‌ కో ప్రొడ్యూస్ చేసింది. మిక్కీ జే మేయర్‌ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేసిన ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా.. జ‌న‌వరి 14 న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వచ్చి మంచి విజయంతో పాటు కలెక్షన్స్ కూడా సాధించింది.

అయితే ఇప్పుడు ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌(Net Flix)లో స్ట్రీమింగ్ కానుంది. ఫిబ్రవరి 11, 2026 నుండి ఈ సినిమా అందుబాటులోకి రానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ‘రాజుగారి పెళ్లంటే ఏడు తరాలు అటు ఇటు గుర్తుండిపోవాలి’ అని స్పెషల్ పోస్టర్‌ షేర్ చేశారు. ఇక థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్‌ను ఏ విధంగా మెప్పిస్తోందో చూడాల్సి ఉంది.

అనిల్ రావిపూడి మనసు గెలుచుకున్న యంగ్ హీరోయిన్ సినిమా.. పోస్ట్ వైరల్

Next Story