Game Changer OTT: ఇట్స్ అఫీషియల్.. నెలరోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘గేమ్ చేంజర్’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే? (పోస్ట్)

by Mallepaka Hamsa |

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), శంకర్ వచ్చిన లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’(Game Changer).

Game Changer OTT: ఇట్స్ అఫీషియల్.. నెలరోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘గేమ్ చేంజర్’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే? (పోస్ట్)
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), శంకర్ వచ్చిన లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’(Game Changer). తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు కథను అందించగా.. సముద్రఖని, ఎస్ జే సూర్య, శ్రీకాంత్(Srikanth), సునీల్, అంజలి(Anjali), నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. అయితే ఇందులో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్‌గా నటించింది. దీనిని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అయితే ఎన్నో అంచనాల మధ్య ‘గేమ్ చేంజర్’ సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్స్‌లోకి వచ్చింది. అంతా హిట్ అవుతుందని భావించగా.. విడుదల రోజే ఆన్‌లైన్‌లోకి హెచ్‌డీ ప్రింట్ రావడంతో బాక్సాఫీసు వద్ద రాణించలేకపోయింది.

‘గేమ్ చేంజర్’ నెగెటివ్ టాక్ రావడంతో భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. కలెక్షన్ల పోస్టర్ విషయంలోనూ అబద్ధాలు చెప్పారని పెద్ద ఎత్తున ట్రోల్ చేసిన విషయం తెలిసిందే. కానీ మెగా అభిమానులను మాత్రం మెప్పించిందనే చెప్పాలి. అయినప్పటికీ ఈ మూవీ ఫిబ్రవరి రెండో వారంలో ఓటీటీలోకి వస్తుందని అంతా భావించారు. కానీ అనుకున్న దానికంటే ముందే రాబోతుంది. తాజాగా, ‘గేమ్ చేంజర్’ డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయినట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ సినిమా ఓటీటీలో హక్కుల్ని ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకోగా.. ఫిబ్రవరి 7 నుంచి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించారు. ‘‘రా మచ్చా రూల్స్ మారిపోతాయి’’ అనే క్యాప్షన్ జత చేశారు. ఇక ఈ పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Next Story