- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాగున్న సినిమాపై అలా క్రిటిసిజం చేయడం కరెక్ట్ కాదు.. లేడీ సూపర్ స్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) ఎమోషనల్ బ్లాక్ బస్టర్ ‘అర్జున్ S/O వైజయంతి’(Arjun S/O Vyjayanthi).

దిశ, సినిమా: నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) ఎమోషనల్ బ్లాక్ బస్టర్ ‘అర్జున్ S/O వైజయంతి’(Arjun S/O Vyjayanthi). ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి(Vijayashanthi) పవర్ ఫుల్ పాత్రలో నటించారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదలైన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా విజయశాంతి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు. ‘‘మా చిత్ర బృందం తరపున ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జీవితంలో మంచి సినిమా చేశామనే తృప్తి ఉంది. కాప్, మదర్ గా చాలా విరామం తర్వాత ఒక పవర్ ఫుల్ పాత్ర చేయడం జరిగింది.
ప్రజలు రాములమ్మని విజయశాంతిని ఎలాంటి పాత్రలో చూడాలని అనుకున్నారో ఈ సినిమాతో అది ఫుల్ ఫిల్ అయ్యింది. ఇప్పుడు యాక్షన్ అనేది ఒకరకంగా నాకు ఛాలెంజ్ అయినా నేను చేశాను. ఈ సినిమాతో తల్లితండ్రులు కొడుకుల బంధాన్ని వారికి ఇవ్వాల్సిన గౌరవాన్ని బలంగా చూపిండం జరిగింది. ఈ కథని దర్శకుడు పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేశారు. మంచి చిత్రం చేశామనే తృప్తి వందశాతం వుంది. చాలా మహిళలు ఫోన్ చేసి సినిమా అద్భుతంగా ఉంది మదర్ అండ్ సన్ ఎమోషన్ కట్టిపడేసిందని చెబుతుంటే చాలా ఆనందంగా అనిపించింది.
పరీక్షల వలన కొందరు చూడలేకపోయారని నాకున్న సమాచారం. రేపటి నుంచి అందరం వెళ్తామని చెబుతున్నారు. రేపటి నుంచి ప్రేక్షకాదరణ ఇంకా అద్భుతంగా ఉండబోతోంది. కళ్యాణ్ బాబు చాలా మంచోడు. సినిమాలో మాకు మంచి బాండ్ ఏర్పడింది. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. తనకి నాపై చాలా ఆప్యాయత. గత జన్మలో తను నాకు బిడ్డ ఏమో నాకు తెలీదు. నేను కొన్నాళ్లుగా చూస్తున్న వాటి మీద స్పందించాను. ఇక్కడ అందరం ఇండస్ట్రీ మీద బతుకుతున్నాం. చాలా బాధ్యతగా ఉండాలి. బాగున్న సినిమాపై అలా క్రిటిసిజం చేయడం కరెక్ట్ కాదు. మీకు నచ్చలేదంటే సజెషన్స్ ఇవ్వచ్చు. మీ దగ్గర కథలంటే చెప్పొచ్చు. కానీ బాగున్న దాని మీద విమర్శ చేయడం కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదనిపించే ఆరోజు అలా మాట్లాడాను’’ అని చెప్పుకొచ్చింది.






