నా కూతురు ఎంతమందితో డేటింగ్ చేసినా ఒకే.. పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదంటూ కియారా సెన్సేషనల్ కామెంట్స్

by Mallepaka Hamsa |

నా కూతురు తనకు నచ్చినంత మంది అబ్బాయిలతో డేటింగ్ చేయడానికి నేను అనుమతిస్తాను. తను డేటింగ్ చేసిన ప్రతి అబ్బాయిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు.

నా కూతురు ఎంతమందితో డేటింగ్ చేసినా ఒకే.. పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదంటూ కియారా సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ, 2025 జూలైలో ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తూనే, యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన కూతురి పెళ్లి, డేటింగ్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో ప్రతి ఒక్కరికీ పూర్తి అవగాహన ఉండాలని కియారా అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో తన కూతురు భవిష్యత్తు గురించి మాట్లాడుతూ.. "నా కూతురు తనకు నచ్చినంత మంది అబ్బాయిలతో డేటింగ్ చేయడానికి నేను అనుమతిస్తాను. తను డేటింగ్ చేసిన ప్రతి అబ్బాయిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. డేటింగ్ వల్ల తను ఎలాంటి వ్యక్తిని కోరుకుంటుందో, తన వ్యక్తిత్వం ఏంటో తనకు అర్థమవుతుంది.

నేను కూడా పెళ్లికి ముందు సిద్ధార్థ్‌తో డేటింగ్ చేశాను కాబట్టే మా బంధం బలంగా ఉంది. అందుకే నా కూతురి విషయంలో కఠినంగా ఉండాలనుకోవడం లేదు" అని చెప్పారు. పాతకాలపు పద్ధతులు వ్యక్తి స్వేచ్ఛకు ఆటంకంగా ఉండేవని, పిల్లలకు జీవితం గురించి ఎవరూ ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వలేరని ఆమె అన్నారు. తన కూతురు స్వతహాగా అన్ని విషయాలు నేర్చుకోవాలని, తన జీవితాన్ని తనకు నచ్చినట్లు జీవించాలని కియారా చెప్పారు. సమాజం ఏమనుకుంటుందో అని భయపడి పిల్లల ఇష్టాలను అణచివేయకూడదనేది ఆమె ఉద్దేశం. కియారా చేసిన ఈ కామెంట్స్‌పై సోషల్ మీడియా రెండుగా విడిపోయింది. కొందరు ఆమె ఆలోచనా విధానాన్ని సమర్థిస్తూ.. "ఆధునిక కాలంలో భాగస్వామిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం, కియారా చాలా బోల్డ్‌గా నిజం చెప్పారు" అని ప్రశంసిస్తున్నారు. అయితే, మరికొందరు మాత్రం ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "అమ్మ అయి ఉండి కూతురికి ఇలాంటి సలహాలు ఇస్తారా? ఎంతమంది అబ్బాయిల జీవితాలతో ఆడుకోమని చెబుతున్నారు?" అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

Next Story