Sreeja - Kalyan Dev: ఆమెను చూసి నెల అవుతుంది.. చాలా మిస్ అవుతున్నానంటూ చిరు మాజీ అల్లుడు ఎమోషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) చిన్న కూతురు శ్రీజ(Sreeja) గురించి పరిచయం అక్కర్లేదు. ఆమె సినిమాల్లో నటించనప్పటికీ తన పెళ్లిళ్లతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుందనడంలో అతిశయోక్తి లేదు.

Sreeja - Kalyan Dev: ఆమెను చూసి నెల అవుతుంది.. చాలా మిస్ అవుతున్నానంటూ చిరు మాజీ అల్లుడు ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) చిన్న కూతురు శ్రీజ(Sreeja) గురించి పరిచయం అక్కర్లేదు. ఆమె సినిమాల్లో నటించనప్పటికీ తన పెళ్లిళ్లతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుందనడంలో అతిశయోక్తి లేదు. మొదట ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంట్లోంచి వెళ్లిపోయి సినీ ఇండస్ట్రీని షేక్ చేసింది. మెగా ఫ్యామిలీకీ స్టార్ హీరోకు చెందిన అమ్మాయి అలా చేయడంతో అంతా షాక్ అయిపోయారు. అయితే శ్రీజ ఓ కూతురు పుట్టిన తర్వాత తన మొదటి భర్తతో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయింది. ఆ తర్వాత చిరు ఆమె బాధను చూడలేక మళ్లీ టాలీవుడ్ నటుడు కళ్యాణ్ దేవ్‌కు ఇచ్చి పెళ్లి చేశాడు.

అయితే వీరికి కూడా నవిష్క అనే కూతురు ఉంది. కానీ గత కొద్ది రోజుల నుంచి వీరిద్దరు దూరంగా ఉంటున్నారు. కానీ విడాకులు తీసుకొని విడిపోయినట్లు వెల్లడించలేదు. కానీ శ్రీజ మాత్రం ఇద్దరు కూతుళ్లతో చిరు ఇంట్లోనే ఉంటున్న విషయం తెలిసిందే. ఇక కళ్యాణ్ దేవ్ మాత్రం తన కూతురు గురించి నిత్యం పలు పోస్టులు పెడుతుండటంతో విడాకులు కన్ఫర్మ్ అని అంతా ఫిక్స్ అయిపోయారు.

కొద్ది కాలం తర్వాత అతను కూడా సైలెంట్ అయ్యాడు. నెల రోజులకు ఒకసారి అయినా తన కూతురిని కలుస్తున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా, కళ్యాణ్ దేవ్(Kalyan Dev) తన కూతురు నవిష్క(Navishka )ను మిస్ అయినట్లు తెలుపుతూ ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. నెల రోజుల నుంచి ఆమె చాలా మిస్ అవుతున్నా అని ఫొటోను కూడా షేర్ చేశాడు. ఇక అది చూసిన వారు నవిష్కను తీసుకువచ్చేది శ్రీజ కాబట్టి భార్య, బిడ్డ గురించి చేశాడు కావచ్చు అని చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం కళ్యాణ్ దేవ్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.




Next Story