Peddi: రామ్ చరణ్ మూవీలో ఐటెం సాంగ్ కు కొత్త కష్టాలు !

by velandi.Saikiran |   (  Updated:2025-05-28 21:30:23  IST  )

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ (Ram Charan ) తాజాగా చేస్తున్న సినిమా పెద్ది ( Peddi ). ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్

Peddi: రామ్ చరణ్ మూవీలో ఐటెం సాంగ్ కు కొత్త కష్టాలు !
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ (Ram Charan ) తాజాగా చేస్తున్న సినిమా పెద్ది ( Peddi ). ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ ( Janhvi Kapoor ) హీరోయిన్ గా చేస్తుంటే... బుచ్చిబాబు ( BUCCHI BABU )తెరకెక్కిస్తున్నారు. క్రికెట్ నేపథ్యంలో ఈ సినిమా వస్తుందని ప్రచారం సాగుతోంది. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి వరుసగా అప్డేట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ఐటెం సాంగ్ విషయంలో తీవ్ర గందరగోళం ఉంది. ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం ఏ హీరోయిన్ అనేది ఇంకా ఫైనల్ చేయలేదని తెలుస్తోంది. మొదట సమంత, ఆ తర్వాత పూజ హెగ్డే, శ్రీ లీల, మరో బాలీవుడ్ హీరోయిన్ పేర్లు కూడా వినిపించాయి. కానీ ఇప్పటివరకు ఏ హీరోయిన్ తో చేయించాలి అనే దాని పైన క్లారిటీ రాలేదు.

ఇలాంటి నేపథ్యంలో ఒక కొత్త టెన్షన్ చిత్ర బృందంలో నెలకొంది. దేశ వ్యాప్తంగా ఎన్నో రొమాంటిక్ అలాగే ఫీల్ గుడ్ సాంగ్స్ చేసిన ఏఆర్ రెహమాన్ ( AR Rahman).. ఐటెం సాంగ్ ఎలా చేస్తాడు అనే దానిపైన సర్వత్ర ఆసక్తి నెలకొంది. తెలుగులో దేవి శ్రీ ప్రసాద్ లేదా తమన్ చేస్తేనే ఐటమ్ సాంగ్. ఈ ఇద్దరు చేసిన ఐటమ్ సాంగ్స్ చాలా వరకు హిట్ అయ్యాయి. మరి ఏ ఆర్ రెహమాన్... వీళ్ళ రేంజ్ ను మించిపోతాడా..? తేలిపోతాడా ? అనే టెన్షన్ మొదలైంది. ఏఆర్ రెహమాన్ చాలా బాగా చేసినా తెలుగు జనాలకు ఎక్కాలి. లేకపోతే ఐటెం సాంగ్ వృధా అవుతుంది.

Next Story