ఆమెనే నా కోడలిగా రావాలని బాలకృష్ణకు కండిషన్ పెట్టిన వసుంధర

by Disha Web Desk 9 |
ఆమెనే నా కోడలిగా రావాలని బాలకృష్ణకు కండిషన్ పెట్టిన వసుంధర
X

దిశ, వెబ్‌డెస్క్: బాలకృష్ణ సతీమణి వసుంధర గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె సినిమాల్లో, రాజకీయాల్లో లేకపోయినా అందరికీ పరిచయమే. కేవలం ఇంటిపట్టునే ఉంటూ తన పిల్లల్ని, ఫ్యామిలీని చూసుకుంటూ లైఫ్ లీడ్ చేస్తుంది. అలాంటి ఈమె మోక్షజ్ఞ పెళ్లి విషయంలో ఓ కండిషన్ పెట్టిందంటూ సోషల్ మీడియాలో ఓ వార్త కుదిపేస్తోంది. నెట్టింట శ్రీలీల, మోక్షజ్ఞ వార్తలు ఎన్నో వినిపిస్తున్నాయి. అలాగే వీరిద్దరి జోడి ఎంతో చక్కగా ఉంటుంది.. మన ఇంటి కోడలు చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నానని.. బాలకృష్ణతో చెప్పిందట. వసుంధర ఫస్ట్ టైం భార్య నోరు విప్పి అడగడంతో ముందు ఆశ్చర్యానికి గురైన బాలయ్య.. ఏం మాట్లాడాలో అర్థం కాక.. సైలెంట్‌గా ఉండిపోయారట. కాగా, ఈ వార్త ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ‘శ్రీలీల ఏకంగా నందమూరి కోడలిగా చాన్స్ కొట్టేసిందిగా.. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం తనంత అదృష్టవంతురాలు ఇంకెవరు ఉండరు’’ అంటూ కామెంట్ల మోత మోగిస్తున్నారు.



Next Story

Most Viewed