ఆస్తులు అమ్ముకోవడానికి రెడీ అయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. కారణమేంటంటే?

by Disha Web Desk 6 |
ఆస్తులు అమ్ముకోవడానికి రెడీ అయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. కారణమేంటంటే?
X

దిశ, సినిమా: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ నిర్మాత అల్లు అరవింద్ తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఎన్నో హిట్స్ అందుకుని మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఈ సినిమా భారీ విజయం అందుకోవడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్‌కు మరింత ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను పెంచింది. ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అలాగే ఐకాన్ స్టార్ ఆహా ద్వారా ఓటీటీ రంగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు.

తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్‌లు అందిస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే చేతినిండా డబ్బు సంపాదిస్తున్నారు. అయితే మొదట తెలుగులో మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆ తర్వాత తమిళంలోనూ ప్రారంభించి మంచి కంటెంట్ ఉన్న సినిమాలను అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, అల్లు అర్జున్ ఆస్తులు అమ్ముకుంటున్నాడని ఓ వార్త వైరల్ అవుతోంది. అధిక ధరల కారణంగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ లాభాలు అందుకోవడం తగ్గిపోయిందట. నష్టాలు వస్తున్నాయని ఆహా ఓటీటీ సంస్థ అమ్మకం కోసం అల్లు ఫ్యామిలీ ప్రయత్నిస్తున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలిసిన వారు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Read More..

ట్రెడిషనల్ లుక్‌లో కుర్రాళ్లను కట్టిపడేస్తున్న నేహా శెట్టి.. పిక్స్ వైరల్



Next Story

Most Viewed