Janhvi Kapoor: కనీస అవగాహన లేకుండా చట్టవిరుద్ధంగా ప్రవర్తించడం భాధాకరం.. జాన్వీ కపూర్ పోస్ట్

by Mallepaka Hamsa |

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్(Janhvi Kapoor) ‘దేవర’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది.

Janhvi Kapoor: కనీస అవగాహన లేకుండా చట్టవిరుద్ధంగా ప్రవర్తించడం భాధాకరం.. జాన్వీ కపూర్ పోస్ట్
X

దిశ, సినిమా: అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్(Janhvi Kapoor) ‘దేవర’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది. మొట్టమొదటి మూవీనే ఘన విజయం సాధించడంతో అమ్మడు ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. తన నటనతో మెప్పించిన ఆ భామ వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. ప్రస్తుతం జాన్వీ కపూర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ‘పెద్ది’(peddi) సినిమాలో నటిస్తోంది. బుచ్చిబాబు సనాBuchibabu Sana) దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీలో జగపతి బాబు(Jagapathi Babu), కన్నడ స్టార్ శివరాజ్ కుమార్(Shivaraj Kumar), దివ్యేందు శర్మ వంటి వారు కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో పాటు ‘పరమ్ సుందరి’ చిత్రం కూడా చేస్తోంది. ఇక జాన్వీ కపూర్ ఓ వైపు షూటింగ్స్‌లో పాల్గొంటూనే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా, ఈ అమ్మడు ఓ యాక్సిడెంట్‌పై స్పందిస్తూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ పోస్ట్ పెట్టింది. అసలు విషయంలోకి వెళితే.. ఓ మహిళ మద్యం మత్తులో కారు నడుపుతూ ఓ బైక్‌ను ఢీ కొట్టింది. ఇక ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న బాలిక అక్కడిక్కడే మరణించింది. ఇక వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను అడ్డుకున్నారు.

ఇక ఈ విషయంపై జాన్వీ స్పందిస్తూ ‘‘ఇలాంటి నిర్లక్ష్య ప్రవర్తనను ఎవరైనా అనుమతిస్తారా? మద్యం సేవించి వాహనం నడిపి చుట్టుపక్కల వారిని ప్రమాదంలో పడేయడం సరైంది కాదని ఎవరైనా అనుకుంటారా? ఈ యాక్సిడెంట్ గురించి తెలిసి దిగ్ర్భాంతికి గురయ్యాను. మద్యం కారణంగా జరిగే ప్రమాదాల్లో ఎంతో మంది జీవితాలను కోల్పోతున్నారు. మరెంతోమంది గాయాలపాలవుతున్నారు. చట్టాలను మనం ఎందుకు గౌరవించడం లేదు. అసలు కనీస అవగాహన లేకుండా చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం’’ అని రాసుకొచ్చింది. అంతేకాకుండా వీడియోను కూడా షేర్ చేసింది.

Next Story