సినిమా ఫ్లాప్ అయితే హీరోయిన్లను బ్లేమ్ చేయడం దారుణం: కృతి శెట్టి

by Mallepaka Hamsa |

సినిమా ఫ్లాప్ అయితే దానికి హీరోయిన్లను బాధ్యులను చేయడం నిజంగా అన్యాయం. అలా నిందించడం నాకు చాలా వింతగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ చిత్రంలో హీరోయిన్‌కు ఉండేది చాలా చిన్న పాత్ర మాత్రమే.

సినిమా ఫ్లాప్ అయితే హీరోయిన్లను బ్లేమ్ చేయడం దారుణం: కృతి శెట్టి
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ కృతి శెట్టి ‘ఉప్పెన’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఒక్క మూవీతో బేబమ్మగా ఓవర్ నైట్‌ స్టార్‌గా మారిన ఆమె చేసిన బంగరాజు, శ్యామ్ సింగరాయ్ మెప్పించినప్పటికీ.. ఆ తర్వాత చేసిన చిత్రాలన్నీ బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచాయి. తెలుగులోనే కాకుండా తమిళంలో ఇటీవల చేసిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, వా వాతియార్ సినిమాలు కూడా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయాయి. దీంతో తమిళంలో కూడా వరుసగా రెండు ఫ్లాప్స్ రావడంతో.. కొంతమంది నెటిజన్లు ఆమెను ఐరన్ లెగ్ అంటూ సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. అయితే వరుసగా ఫ్లాప్స్ వస్తున్నప్పటికీ కృతి శెట్టికి సినిమా అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బేబమ్మ తనపై వస్తున్న ట్రోల్స్, సినిమా పరాజయాలపూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ‘‘సినిమా ఫ్లాప్ అయితే దానికి హీరోయిన్లను బాధ్యులను చేయడం నిజంగా అన్యాయం.

అలా నిందించడం నాకు చాలా వింతగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ చిత్రంలో హీరోయిన్‌కు ఉండేది చాలా చిన్న పాత్ర మాత్రమే. మూవీని ఎలా తీర్చిదిద్దాలి, కథను ఎలా నడిపించాలి అనే విషయాల్లో హీరోయిన్లకు కనీసం మాట్లాడే హక్కు కూడా ఉండదు. అయినప్పటికీ వారిపై ఐరన్ లెగ్ అనే ముద్ర వేయడం దారుణం. అసలు ఒక విజయవంతమైన సినిమాను ఎలా తీయాలో ఇండస్ట్రీలో ఎవరికీ ముందే తెలియదు" అంటూ కృతి శెట్టి చెప్పుకొచ్చింది. ఇక ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సినిమా పరాజయానికి హీరోయిన్ ఒక్కరినే బ్లేమ్ చేయడం తప్పు అంటూ కొందరు ఆమెకు మద్దతు ఇస్తుంటే.. మరికొంతమంది మాత్రం ఆమెపై మండిపడుతున్నారు. మూవీ హిట్ అయితే క్రెడిట్ తీసుకునే హీరోయిన్లు, ఫ్లాప్ అయితే మాత్రం తమకేం సంబంధం లేదన్నట్టు మాట్లాడటం కరెక్ట్ కాదని విమర్శిస్తున్నారు. అంతేకాకుండా విజయవంతమైన సినిమా ఎలా తీయాలో ఎవరికీ తెలియదు అనడం ఇండస్ట్రీలోని సీనియర్ దర్శకనిర్మాతలను తక్కువ చేసి మాట్లాడిందంటూ నెట్టింట నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి కృతి శెట్టి చేసిన ఈ కామెంట్స్ టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

Next Story