ఫన్ యాక్షన్ ఎమోషన్ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి..అద్భుతంగా ఉంటుంది: సుస్మిత కొణిదెల

by Mallepaka Hamsa |

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) 'మన శంకర వర ప్రసాద్ గారు' (Mana Shankara Vara Prasad Garu)తో ప్రేక్షకులను అలరించబోతున్నారు.

ఫన్ యాక్షన్ ఎమోషన్ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి..అద్భుతంగా ఉంటుంది: సుస్మిత కొణిదెల
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) 'మన శంకర వర ప్రసాద్ గారు' (Mana Shankara Vara Prasad Garu)తో ప్రేక్షకులను అలరించబోతున్నారు. ఇందులో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రతో నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తోంది. 'మన శంకర వర ప్రసాద్ గారు’ సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ‘‘ఇది మైల్ స్టోన్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ చేయడం ఒగ గౌరవంగా భావిస్తున్నాము.

నాన్నగారి కోర్ జానర్ లో చేయడం, అనిల్ గారు ఆ జానర్ ని తీసుకోవడం సూపర్బ్. సాహు గారితో జర్నీ బ్యూటీఫుల్. ఇది చాలా ఎంజాయ్ చేస్తూ చేసిన మైల్ స్టోన్ ప్రాజెక్ట్. ఈ కాంబినేషన్ మళ్ళీ కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాను. వెంకటేష్ గారు బిగ్ ఇంపాక్ట్ ఫుల్ క్యారెక్టర్‌లో కనిపిస్తారు. ఆయన వచ్చిన తర్వాత ఫన్ మరింతగా రైజ్ అవుతుంది. చాలా ముఖ్యమైన పాత్ర. చాలా ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్న రిచ్ క్యారెక్టర్. చిరంజీవి గారి క్యారెక్టర్ లో ఫన్ యాక్షన్ ఎమోషన్ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. వెంకటేష్ గారు చిరంజీవి గారి మధ్య చాలా అద్భుతమైన కామెడీ సీన్స్ఉంటాయి. ట్రైలర్ జస్ట్ సాంపిల్ మాత్రమే. ఈ సినిమా సంక్రాంతి విందు అనేది చిన్న మాట.. అద్భుతంగా ఉంటుంది’’ అన్నారు.

Next Story