- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెడలో మంగళసూత్రంతో త్రిష.. సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారా?
స్టార్ హీరోయిన్ త్రిష మరోసారి వార్తల్లో హాట్ టాపిక్‌గా మారింది. తమిళనాడు సీఎం, నటుడు విజయ్‌తో త్రిష కొన్నేళ్లుగా ప్రేమలో ఉందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విజయ్ భార్య సంగీత అతడికి విడాకుల నోటీసులు పంపగా... త్రిష విజయ్ కలిసి పలు కార్యక్రమాల్లో సందడి చేస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: స్టార్ హీరోయిన్ త్రిష మరోసారి వార్తల్లో హాట్ టాపిక్‌గా మారింది. తమిళనాడు సీఎం, నటుడు విజయ్‌తో త్రిష కొన్నేళ్లుగా ప్రేమలో ఉందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విజయ్ భార్య సంగీత అతడికి విడాకుల నోటీసులు పంపగా... త్రిష విజయ్ కలిసి పలు కార్యక్రమాల్లో సందడి చేస్తున్నారు. విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సమయంలోనూ త్రిష అక్కడ మెరిసింది. విజయ్ గెలుపు వెనుక కూడా త్రిష పూజల ఫలితం ఉందని తమిళనాట జోరుగా చర్చ జరిగింది. ఇక వీరిద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో త్రిష మరోసారి వార్తల్లో నిలిచారు.
రీసెంట్ గా త్రిష ఓ కార్యక్రమంలో పాల్గొనగా ఆమె మెడలో ఓ లాకెట్ కనిపిస్తోంది. అయితే అది ఖచ్చితంగా కేరళ క్రిస్టియన్ స్టైల్ మంగళసూత్రం అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దానిని మిన్ను అంటారని, కేరళలో క్రిస్టియన్స్ దీనినే మంగళసూత్రంగా కట్టుకుంటారని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తుండటంతో విజయ్, త్రిష పెళ్లి జరిగిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి నిజంగా పెళ్లి జరిగిందా లేదా అనేది తెలియాలి అంటే త్రిష కానీ విజయ్ కానీ స్పందించాల్సి ఉంది.






