- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రామ్ నెక్స్ట్ మూవీ ఆలస్యానికి కారణం ఇదేనా?.. తప్పుకున్న దర్శకుడు?
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రామ్ తన కోసం ఒక కథను సిద్ధం చేసుకుని దానిని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించే సరైన దర్శకుడి కోసం ప్రస్తుతం వెతుకులాట కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యువ నటుడు రామ్ పోతినేని కొంతకాలం క్రితం ఆంధ్ర కింగ్ తాలూకా అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ లభించినప్పటికీ, బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో భారీ విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమా విడుదలైన కొద్ది రోజులకే రామ్ తన కొత్త సినిమాను ప్రారంభించనున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. అనంతరం, ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ శిష్యుడు అయిన విఘ్నేష్ దర్శకత్వంలో రామ్ ఓ సినిమా చేయనున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. దీంతో వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా ఖరారైందనే ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో జోరుగా సాగింది.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, రామ్ తన కోసం ఇప్పటికే ఒక కథను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ కథ విషయంలో రామ్, విఘ్నేష్ మధ్య పలు చర్చలు కూడా జరిగినట్లు సమాచారం. అయితే కొన్ని కారణాల వల్ల విఘ్నేష్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆ కథను ఓన్ చేసుకొని దానిని వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించే సరైన దర్శకుడి కోసం రామ్ ప్రస్తుతం వెతుకులాట కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో రామ్ తదుపరి సినిమా ప్రారంభం కావడానికి మరికొంత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.






