బిలేటెడ్ వెడ్డింగ్ లుక్స్ అంటూ ఆ ఫొటోలు షేర్ చేసిన యంగ్ బ్యూటీ.. మ్యారేజ్ చేసుకుంటుందా..?

by Gugulothu.Kavitha |

యంగ్ బ్యూటీ హెబ్బా పటేల్(Hebha Patel) ‘కుమారి 21 ఎఫ్’(Kumari 21F) మూవీతో టాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయమయ్యింది.

బిలేటెడ్ వెడ్డింగ్ లుక్స్ అంటూ ఆ ఫొటోలు షేర్ చేసిన యంగ్ బ్యూటీ.. మ్యారేజ్ చేసుకుంటుందా..?
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ బ్యూటీ హెబ్బా పటేల్(Hebha Patel) ‘కుమారి 21 ఎఫ్’(Kumari 21F) మూవీతో టాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయమయ్యింది. తన ఫస్ట్ సినిమాతోనే స్టార్‌డమ్ అందుకుంది. దీంతో ఓ రేంజ్‌లో పాపులర్ అయిపోతుంది అని అందరూ అనుకున్నారు. బట్ ఈ మూవీ తర్వాత ఎన్నో సినిమాలు చేస్తున్నా సరైన హిట్‌ మాత్రం అందుకోలేకపోయింది. ఇక ‘ఓదెల రైల్వే స్టేషన్’(Odela Railway Station)లో డీ-గ్లామర్ పాత్ర చేసినా పెద్ద గుర్తింపు రాలేదు.

అయినప్పటికీ డీలా పడకుండా వచ్చిన అవకాశాల్లో నటిస్తూ మెప్పిస్తుంది. ప్రజెంట్ వరుస సినిమాల్లో నటిస్తూ మెప్పించడానికి రెడీ అవుతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా హెబ్బా పటేల్ తన సోషల్ మీడియా(social Media)లో కొన్ని పిక్స్ షేర్ చేసింది. అందులో కళ్లకు కాటుక పెట్టుకుని ట్రెడిషనల్ లుక్‌లో కనిపించింది. ఇక ఈ ఫొటోస్‌కు ‘ఆలస్యమైన పెళ్లి చూపులు’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక వాటిని చూసిన నెటిజన్లు మ్యారేజ్ చేసుకుంటున్నావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story