- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘అతడు’ సినిమా వదిలేయడానికి కారణం అదేనా? దేవి శ్రీ ప్రసాద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ... అతడు కోసం తనను మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకోవాలని భావించారని, కానీ తాను ఆ సినిమా చేయనని చెప్పినట్లు వెల్లడించాడు.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన దేవిశ్రీ ప్రసాద్ కొంతకాలం క్రితం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో ఆయన అతడు సినిమా ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన విషయాన్ని వెల్లడిస్తూ, దానికి గల కారణాలను కూడా వివరించారు. దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ.. “నేను సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన కొత్తలోనే మహేష్ బాబు గారి ‘అతడు’ సినిమాకు సంగీతం అందించే అవకాశం వచ్చింది. అయితే అప్పటికే ఆ సినిమాకు మరో సంగీత దర్శకుడు ఎంపికయ్యారు. మధ్యలో నన్ను తీసుకోవాలని భావించి నాకు ఫోన్ చేశారు.
అప్పుడు నేను ‘అలా చేయను సార్. నేను ఒక సినిమాకు కమిట్ అయితే ఆ సినిమాను పూర్తిగా పూర్తి చేస్తాను. వేరొకరు ప్రారంభించిన సినిమాను నేను చేయను. దయచేసి నన్ను తప్పుగా అనుకోకండి’ అని చెప్పాను. దాంతో ఆ సినిమా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా ‘శభాష్.. నువ్వు ఇలాగే ఉండు, నీ ఎథిక్స్‌ను ఫాలో అవు’ అని అన్నారు. ఒక సందర్భంలో మహేష్ బాబు గారు కూడా ‘నా సినిమా చేయనన్నావు కదా’ అని నవ్వుతూ అన్నారు. అలాగే త్వరలో మనిద్దరం కలిసి ఓ ప్రాజెక్ట్ చేద్దామని కూడా చెప్పారు. అలా నా కెరీర్ ప్రారంభంలోనే ‘అతడు’ సినిమా ఆఫర్‌ను వదులుకున్నాను. ఆ తర్వాత మాత్రం మహేష్ బాబు గారితో చాలా సినిమాలు చేశాను” అని దేవిశ్రీ ప్రసాద్ చెప్పుకొచ్చారు.






