- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీకి చిక్కులు
టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న శ్రీలీల బాలీవుడ్‌లో అడుగు పెట్టడానికి అన్నీ అడ్డంకులు వస్తున్నాయి.

దిశ, సినిమా: ‘పెళ్లి సందD’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల.. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. దీంతో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు అందుకుంటూ మోస్ట్ వాంటెండ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిపోయి బాలీవుడ్‌లో కూడా ఆఫర్ అందుకున్న విషయం తెలిసిందే. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న ‘ఆషిఖీ3’లో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నట్లు ప్రకటన కూడా వచ్చింది. అనురాగ్ బసు తెరకెక్కిస్తున్న ఈ చిత్రం అనౌన్స్ చేసి ఇప్పటికే రెండేళ్లు అవుతున్నా ఇప్పటి వరకు విడుదలకు నోచుకోలేదు. ఈ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాతో హిందీలో కూడా శ్రీలీల తన మార్క్‌ను సెట్ చేసుకుంటుంది అని ఎక్స్‌పెక్ట్ చేసి ఫ్యాన్స్‌కు ‘ఆషిఖి 3’ ఎప్పటికప్పుడు నిరాశే మిగుల్చుతుంది. ఇక ఈ ఏడాది అయిన విడుదల అవుతుందేమో అని ఆశ పడగా.. ఈ చిత్రం కేవలం 40% షూటింగ్ మాత్రమే పూర్తి చేసుకుందని దర్శకుడు అనురాగ్ బసు తాజాగా చెప్పడంతో.. ఈ ఏడాది కూడా శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ ఆగినట్లే అని అర్థం అవుతుండగా.. ఫ్యాన్స్ నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు






