సముద్రఖనికి మరో సక్సెస్.. 'కార్మేని సెల్వం' ఎలా ఉందంటే?

by Pulgam srinivas |   (  Updated:2026-04-03 12:39:52  IST  )

'కార్మేని సెల్వం'.. ఆ విషయంలో మరోసారి పాస్ అయిన సముద్రఖని.

సముద్రఖనికి మరో సక్సెస్.. కార్మేని సెల్వం ఎలా ఉందంటే?
X

దిశ, వెబ్ డెస్క్: సముద్రఖని, లక్ష్మీ ప్రియా జంటగా నటించిన చిత్రం కార్మేని సెల్వం. ఇందులో గౌతమ్ వాసుదేవ్ మీనన్, అభినయ కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం కంప్లీట్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మించిన ఈ చిత్రానికి రామ్ చక్రి దర్శకత్వం వహించారు. ఈరోజు విడుదలైన ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది.

కథ విషయానికి వస్తే...

ఈ సినిమాలో సముద్రఖని, లక్ష్మీ ప్రియా దంపతులుగా నటించారు. వీరిద్దరూ ఎంతో కష్టపడుతూ కుటుంబాన్ని ముందుకు సాగిస్తూ ఉంటారు. ఒక మంచి ఇల్లు కట్టుకోవడం, ఒక కారు కొనుగోలు చేయడం వీరి పెద్ద కోరికగా ఉంటుంది. దాని కోసం రూపాయి రూపాయి పోగు చేస్తూ జీవితాన్ని నెట్టుకొస్తారు.అయితే ఒక ఫ్యామిలీ ఫంక్షన్‌లో సముద్రఖని, లక్ష్మీ ప్రియాకి బంధువుల ద్వారా అవమానాలు ఎదురవుతాయి. ఆ అవమానాన్ని మర్చిపోలేక పెద్ద ఎత్తున డబ్బు సంపాదించాలని సముద్రఖని ప్రయత్నాలను మొదలు పెడతాడు. అయితే ఆ ప్రయత్నాల వల్ల అతను భారీగా అప్పుల పాలవుతాడు. ఆ తర్వాత అతని జీవితం ఎలాంటి మలుపులు తీసుకుంది? చివరకు వారి కుటుంబ పరిస్థితి ఎలా మారింది? అనే విషయాలు వెండితెరపై చూడాల్సిందే.

విశ్లేషణ:

ఈ సినిమాలో దర్శకుడు తీసుకున్న పాయింట్ చాలా చిన్నదైనా, దానిని సాధారణ మిడిల్ క్లాస్ కుటుంబాలకు దగ్గరగా అనిపించేలా తెరకెక్కించాడు. ఇందులో ప్రధాన పాత్రల్లో నటించిన సముద్రఖని, లక్ష్మీ ప్రియా తమ నటనతో మంచి ప్రశంసలు అందుకుంటున్నారు. ఓవరాల్‌గా చూస్తే, ‘కార్మేని సెల్వం’ సినిమా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రేటింగ్: (3/5)

Next Story