రాజీవ్ కనకాలకి రూ.350 కోట్ల నష్టం..నమ్మించి మోసం చేసిన నటుడు ?

by velandi.Saikiran |

టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజీవ్ కనకాల ( Rajiv Kanakala) గురించి తెలియని వారు ఉండరు. చిన్న చిన్న పాత్రల నుంచి పెద్ద స్థాయి

రాజీవ్ కనకాలకి రూ.350 కోట్ల నష్టం..నమ్మించి మోసం చేసిన నటుడు ?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజీవ్ కనకాల ( Rajiv Kanakala) గురించి తెలియని వారు ఉండరు. చిన్న చిన్న పాత్రల నుంచి పెద్ద స్థాయి వరకు ఎదిగాడు రాజీవ్ కనకాల. స్టార్ హీరో సినిమా ఉందంటే కచ్చితంగా అందులో రాజీవ్ కనకాల పాత్ర ఉండాల్సిందే. అయితే అలాంటి రాజీవ్ కనకాలను ఓ స్టార్ నటుడు మోసం చేశాడట. ఏకంగా 350 కోట్లు ఎగగొట్టినట్లు తెలుస్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు వివరాల్లోకి వెళితే... టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజీవ్ కనకాల, హర్షవర్ధన్ (Harshavardhan ) ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. వీళ్లతో పాటు సమీర్ ( Sameer) కూడా కలిసిపోతాడు. అయితే ఒకానొక సమయంలో... రాజీవ్ కనకాల అలాగే హర్షవర్ధన్ ఇద్దరూ కూడా మూడు రోజుల పాటు ఒకే రూమ్ లో గడిపారట. ఈ విషయాన్ని.. హర్షవర్ధన్ తాజాగా ఓ పాడ్ క్యాస్ట్ వేదికగా వెల్లడించాడు. అలాగే ఈ సందర్భంగా జరిగిన ఓ సన్నివేశాన్ని కూడా గుర్తు చేసుకున్నాడు హర్షవర్ధన్.

మొదటి రోజు రాత్రి 8 గంటలకు కార్డ్స్ ( Cards) ఆడడం మొదలుపెట్టామని... అలా మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు ఆడుతూనే ఉన్నామన్నాడు. అలా మొత్తం మూడు రోజుల పాటు కార్డ్స్ ఆడినట్లు హర్షవర్ధన్ తెలిపాడు. ఆ సమయంలో... క్యాజువల్ గా డబ్బులు పెట్టి ఆడినట్లే ఆడామని వివరించాడు. ఈ తరుణంలోనే సమీర్ తమ వద్దకు వచ్చి... ఎన్ని గంటలు కార్డ్స్ ఆడతారని అడిగాడని హర్షవర్ధన్ తెలిపాడు. ఎవరిని సంపాదించారని ప్రశ్నించాడట. దీంతో రాజీవ్ కనకాలకు 350 కోట్లు బాకీ పడ్డాను అని హర్షవర్ధన్ తెలిపాడట. కాదు కాదు 362 కోట్లు అంటూ రాజీవ్ కనకాల అరిచినట్లు హర్షవర్ధన్ తెలిపాడు. దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Next Story