‘లెనిన్’ మరోసారి పోస్ట్‌పోన్ కానుందా?

by Pulgam srinivas |

‘లెనిన్’ సినిమా విడుదల మరోసారి వాయిదా పడే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

‘లెనిన్’ మరోసారి పోస్ట్‌పోన్ కానుందా?
X

దిశ, వెబ్ డెస్క్: అక్కినేని అఖిల్ ప్రస్తుతం ‘లెనిన్’ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. మోస్ట్ బ్యూటిఫుల్ యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ఈ చిత్రంలో హీరోయిన్‌గా కనిపించనుంది. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను జూన్ 26న విడుదల చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితం మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే విడుదల తేదీ దగ్గరపడుతున్నప్పటికీ ఇప్పటివరకు చిత్రానికి సంబంధించిన ప్రమోషన్లు వేగం అందుకోలేదు. అలాగే ట్రైలర్ విడుదలపై కూడా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

దీంతో ఈ సినిమా విడుదల మరోసారి వాయిదా పడే అవకాశం ఉందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ‘లెనిన్’ అనుకున్న సమయానికే ప్రేక్షకుల ముందుకు వస్తుందా? లేక విడుదల తేదీ మారుతుందా? అనేది ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇక ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, అక్కినేని నాగార్జున సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Next Story