- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అల్యూమినియం ఫ్యాక్టరీలో ఇరుముడి యూనిట్.. ఫ్యాన్సును సర్ప్రైజ్ చేసిన రవితేజ
‘ఇరుముడి’ చివరి షెడ్యూల్ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో తెరకెక్కిస్తున్నారని సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం నటిస్తున్న భారీ చిత్రం ‘ఇరుముడి’పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో రవితేజ తొలిసారిగా అయ్యప్ప స్వామి భక్తుడి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాతో రవితేజ మరోసారి బలమైన కం బ్యాక్ ఇస్తాడని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం ‘ఇరుముడి’ చివరి షెడ్యూల్ చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఈ ఫైనల్ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఈ షెడ్యూల్ పూర్తయితే సినిమాకు సంబంధించిన మొత్తం షూటింగ్ కూడా ముగియనున్నట్లు టాక్ వినిపిస్తోంది. షూటింగ్ పూర్తైన వెంటనే మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాతే ఈ సినిమా విడుదల తేదీపై అధికారిక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియ భవాని శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.






