- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మొదలైన #MEGA157 గోల.. 'గ్యాంగ్ లీడర్'తో ఫ్యాన్స్ కి ఫస్ట్ ట్రీట్
మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ), అనిల్ రావిపూడి ( Anil Ravipudi) కాంబినేషన్ లో కొత్త సినిమా వస్తున్న సంగతి తెలిసిం

దిశ, వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ), అనిల్ రావిపూడి ( Anil Ravipudi) కాంబినేషన్ లో కొత్త సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. Mega 157 పేరుతో వస్తున్న ఈ సినిమా టైటిల్ ఇంకా అనౌన్స్ చేయలేదు. రెండు రోజుల కిందట ఈ సినిమా షూటింగుకు కొబ్బరికాయ కొట్టారు. విక్టరీ వెంకటేష్ ( Victory Venkatesh ) ప్రత్యేక ఆహ్వానితుడిగా వచ్చిన నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అయితే తాజాగా మరో క్రేజీ అప్డేట్ ఈ సినిమా నుంచి వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవి అలాగే అనిల్ రావిపూడి సినిమాకు పని చేసే గ్యాంగ్.. చిత్ర బృందం పరిచయం చేసింది.
ఈ సినిమాకు పనిచేస్తున్నారు రైటర్లు, టెక్నీషియన్స్, అలాగే మ్యూజిక్ డై రెక్టర్, చివరికి దర్శకుడిని పరిచయం చేస్తూ ఓ వీడియో విడుదల చేసింది చిత్ర బృందం. చివరకు సుస్మిత కొణిదల కూడా... ఈ వీడియోలో కనిపించారు. అయితే ఈ సినిమాకు మరోసారి భీమ్స్ సిసిరోలియో ( Bheems Ceciroleo) సంగీత స్వరాలు అందించబోతున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ఇప్పటికే మ్యూజిక్ అందించి సక్సెస్ అయిన భీమ్స్ సిసిరోలియో ( Bheems Ceciroleo) ను చిరంజీవి సినిమాకు కూడా ఫైనల్ చేశారు. ఇక మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ), అనిల్ రావిపూడి ( Anil Ravipudi) కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ లో హీరోయిన్ కూడా ఫైనల్ కాలేదు. త్వరలోనే హీరోయిన్ పై క్లారిటీ రానుంది.






