Rashmika Mandanna: రష్మిక మందన్న సినిమాపై లేటెస్ట్ అప్‌డేట్.. షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే..

by Chukka Sudharani |   (  Updated:2025-06-04 12:32:11  IST  )

నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది.

Rashmika Mandanna: రష్మిక మందన్న సినిమాపై లేటెస్ట్ అప్‌డేట్.. షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే..
X

దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది. ఆమె నటిస్తు్న్న లేటెస్ట్ మూవీ ‘కాక్టెయిల్ 2’ (Cocktail 2). 2012లో వచ్చిన హిందీ సినిమా ‘కాక్టెయిల్’ (Cocktail) అప్పట్లో సూపర్ హిట్ సక్సెస్ అందుకుంది. ఇప్పుడు ఈ రొమాంటిక్ కామెడీ చిత్రానికి ఫ్రాంచైజీగా ‘కాక్టెయిల్ 2’ తెరకెక్కించే పనిలో పడ్డాడు నిర్మాత దినేష్. లవ్ రంజన్ కథ అందిస్తున్న ఈ చిత్రానికి హోమి అడజానియా దర్శకత్వం వహించనున్నారు. ఇందులో షాహిద్ కపూర్ (Shahid Kapoor) హీరోగా నటిస్తుండగా.. కృతి సనన్ (Kriti Sanon), రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది.

బాలీవుడ్ (Bollywood) మీడియా వర్గాల నుంచి అందుకున్న సమాచారం మేరకు.. కాక్‌టెయిల్ 2 షూటింగ్ ఈ ఏడాది ఆగస్టు నుంచి స్టార్ట్ కానుంది. అలాగే.. జనవరి 2026 నాటికి పూర్తవుతుంది. యూరప్‌లోని కొన్ని అందమైన ప్రదేశాలలో ఈ సినిమా చిత్రీకరించబడుతుందని సమాచారం. చిత్రీకరణ పూర్తయిన తర్వాత నిర్మాతలు 2026 సమ్మర్‌లో ఈ రొమాంటిక్ కామెడీని విడుదల చేసే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తుంది. కాగా.. ప్రస్తుతం రష్మిక ఆయుష్మాన్ ఖురానాతో కలిసి తమా చిత్రంలో నటిస్తుండగా.. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యాక ‘కాక్టెయిల్ 2’లో భాగం కానుంది.

Next Story