- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
స్పెషల్ సర్‌ప్రైజ్ రాబోతుందంటూ టాలీవుడ్ యంగ్ హీరో ఇంట్రెస్టింగ్ ట్వీట్.. బిగ్ షాక్ ఇవ్వబోతున్నాడా?

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి(Naveen Polishetty) చివరగా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అనగనగా ఒకరాజు’(AnaganagaOkaRaju). మారి (maari) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి(Meenakshi Chowdhury) హీరోయిన్‌గా కనిపించనుంది. అయితే దీనిని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్ పై ఎస్. నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కీ జె. మేయర్ సంగీతం సమకూరుస్తుండగా.. యువరాజ్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. ఇక 2021లోనే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మొదలవగా పలు కారణాల వల్ల ఆలస్యం అవుతోంది.
అయితే గత కొద్ది రోజుల నుంచి ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో ఓ నెటిజన్లు నవీన్ పొలిశెట్టిని ట్యాగ్ చేస్తూ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ‘‘నవీన్ పొలిశెట్టి ఈ తరం తెలుగు నటుల్లో అత్యుత్తమ నటుడిగా నిలుస్తున్నారు అని నేను నమ్ముతాను. అతనిని ప్రత్యేకంగా నిలిపే విషయం అంటే అతని బహుముఖ ప్రతిభ. ఒక్కటే శైలి లేదా యాక్సెంట్‌కి అతను పరిమితం కాడు. ప్రతి పాత్రలోకి పూర్తిగా కలిసిపోయి, తన అప్రతిహత స్పాంటేనిటీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. ఇప్పుడు అనగనగాఒకరాజు లో గోదావరి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా, ప్రామాణిక గోదావరి యాసతో కనిపిస్తున్నాడు.
ఇప్పటికే విడుదలైన ప్రమోస్ ఎంతో వినోదాత్మకంగా ఉన్నాయి. షూటింగ్ అప్‌డేట్స్ ప్రకారం, “రాజు గారు”గా నవీన్ అదరగొడుతున్నాడని చెప్పవచ్చు. త్వరలో వెలుగులోకి రాబోయే తార’’ అని రాసుకొచ్చాడు. ఇక ఈ పోస్ట్ చూసిన నవీన్ పొలిశెట్టి ‘‘ఈ మోటివేషన్ నా హృదయాన్ని తాకింది. మిమ్మల్ని మరింత అలరించేందుకు నా వంతు కృషి చేస్తాను. నేను చేయబోతున్న నా ‘అనగనగా ఒకరాజు చిత్రానికి సంబంధించిన షూట్ చాలా అంటే చాలా బాగా వస్తుంది. త్వరలోనే ఒక సర్‌ప్రైజ్, స్పెషల్ అప్డేట్ రాబోతుంది’’ అని రాసుకొచ్చారు. ఇక ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోయింది.