Nidurinchu Jahapana: ఇంట్రెస్టింగ్‌గా ‘నిదురించు జహాపన’ టీజర్..

by Chukka Sudharani |

‘ప్రేమించుకుందాం రా, సూర్యవంశం, మనసంతా నువ్వే’ లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులని అలరించిన పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్ (child artist) ఆనంద్ వర్ధన్ (Anand Vardhan) హీరోగా పరిచయం అవుతున్న చిత్రం

Nidurinchu Jahapana: ఇంట్రెస్టింగ్‌గా ‘నిదురించు జహాపన’ టీజర్..
X

దిశ, సినిమా: ‘ప్రేమించుకుందాం రా, సూర్యవంశం, మనసంతా నువ్వే’ లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులని అలరించిన పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్ (child artist) ఆనంద్ వర్ధన్ (Anand Vardhan) హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘నిదురించు జహాపన’ (Nidurinchu Jahapana). ఈ యూనిక్ ఎంటర్‌టైనర్ మూవీని ప్రసన్న కుమార్ దేవరపల్లి తెరకెక్కిస్తుండగా.. ఏఆర్ ఎంటర్‌టైన్మెంట్స్‌పై సామ్ నిర్మిస్తున్నాడు. ఇందులో నవమి గయాక్, రోష్ని సాహోతా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్‌కి మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా టీజర్ (teaser) రిలీజ్ చేశారు మేకర్స్.

‘మనిషి నిద్రపోయే వరకు సైన్స్ అయితే నిద్రపోయాక ఏం జరుగుతుందనేది మాయ’ అనే వాయిస్ ఓవర్‌తో మొదలైన ఈ టీజర్‌లో కాన్సెప్ట్, స్క్రీన్ ప్లే, లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ అన్నీ చాలా యూనిక్‌గా ఉన్నాయి. ఆనంద్ వర్ధన్, నవమి గయాక్, రోష్ని సాహోతా మధ్య లవ్ స్టొరీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అంతే కాకుండా అనూప్ రూబెన్స్ బీజీఎం ఎమోషన్‌ని మరింత ఎలివేట్ చేసింది. ఫైనల్‌గా ఈ టీజర్ సినిమాపై చాలా క్యురియాసిటీ క్రియేట్ చేసింది. కాగా.. రామరాజు, పోసాని కృష్ణ మురళి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

Next Story