ఇంట్రెస్టింగ్‌గా పోలీస్ స్టేషన్‌లోని మోస్ట్ వాంటెడ్ బోర్డు

by Chukka Sudharani |

పి.శంకర్ గౌరి (Director P.Shankar Gauri) దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘డాన్ బోస్కో’ (Don Bosco ).

ఇంట్రెస్టింగ్‌గా పోలీస్ స్టేషన్‌లోని మోస్ట్ వాంటెడ్ బోర్డు
X

దిశ, సినిమా: పి.శంకర్ గౌరి (Director P.Shankar Gauri) దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘డాన్ బోస్కో’ (Don Bosco ). కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాను లౌక్య ఎంటర్టైన్మెంట్స్, శ్రీ మాయ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పనేని, శైలేష్ రామ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమాలతో చిత్రీకరణ ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత నాగ వంశీ (Producer Nagavanshi)ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముహూర్తం షాట్‌కు నిర్మాత సాహు గారపాటి (Producer Sahu Garapati)కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. చుక్కపల్లి సురేష్ క్లాప్ కొట్టారు. చిన్నబాబు స్క్రిప్ట్‌ను మేకర్స్‌కు అందజేశారు.

ఈ సందర్భంగా.. మూవీ టైటిల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘వెల్‌కమ్ టు ది క్లాస్ రీయూనియన్-బ్యాచ్ 2014.. అన్ని రీయూనియన్లు జ్ఞాపకాల కోసం కాదు; కొన్ని విముక్తికి సంబంధించినవి’ అంటూ పోస్టర్‌పై రాసిన క్యాప్షన్‌ ఆసక్తిని రేకిత్తిస్తోంది. ఇక సినిమాలోని పాత్రలు ఎలా ఉంటాయో పోస్టర్‌లో చూపించగా.. పోలీస్ స్టేషన్‌లోని మోస్ట్ వాంటెడ్ బోర్డు ఇంట్రెస్టింగ్‌గా ఉంది. కాగా.. ఈ సినిమాలో ప్రిన్సిపాల్ విశ్వనాథ్‌గా మురళీ శర్మ(Murali Sharma) ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. రుష్య, మీర్నా మీనన్, మౌనిక, విష్ణు ఓయ్, రాజ్‌కుమార్ కసిరెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Next Story