అల్లు అర్జున్ సినిమాలో నటిస్తే ఎవరూ పట్టించుకోలేదు.. నటుడు భావోద్వేగం

by Gantepaka Srikanth |

తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన స్టైల్లో రాణిస్తున్న నటుడు రఘుబాబు. ఈ గెటప్.. ఆ గెటప్ అనే తేడా లేకుండా అన్ని గెటప్స్‌లో కనిపించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు.

అల్లు అర్జున్ సినిమాలో నటిస్తే ఎవరూ పట్టించుకోలేదు.. నటుడు భావోద్వేగం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన స్టైల్లో రాణిస్తున్న నటుడు రఘుబాబు(Raghubabu). ఈ గెటప్.. ఆ గెటప్ అనే తేడా లేకుండా అన్ని గెటప్స్‌లో కనిపించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. తాజాగా.. ఆయన ఇండస్ట్రీలో ఎదుర్కొన్న ఒక ఇన్సిడెంట్ గురించి చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు. హాస్య నటుడు బ్రహ్మానందం(Brahmanandam), ఆయన కుమారుడు గౌతమ్(Gautham) కలిసి నటించిన ‘బ్రహ్మ ఆనందం’ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ ఇవాళ హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఫంక్షన్‌లో పాల్గొన్న రఘుబాబు మాట్లాడుతూ.. ‘అల్లు అర్జున్ హీరోగా నటించిన బన్నీ సినిమాలో నటించాను. అది సూపర్ డూపర్ సక్సెస్ అయ్యింది. సక్సెస్ మీట్‌లో అందరూ సినిమాను పొగిడారు. అందులో నటించిన యాక్టర్స్‌ను మెచ్చుకున్నారు. కానీ నా గురించి ఎవరూ మాట్లాడలేదు. కనీసం నా నేను అందులో క్యారెక్టర్ చేశాననే సంగతే మర్చిపోయారు. డైరెక్టర్ వీవీ వినాయక్ కూడా ఏంటయ్యా.. అంత బాగా చేసినా నీ గురించి ఎవరూ మాట్లాడటం లేదు అని అడిగారు. సరిగ్గా అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి స్టేజీ మీదకు వచ్చి రఘుబాబు అద్భుతంగా చేశావు అని నన్ను మెచ్చుకున్నారు. మళ్లీ సినిమా చూడాలనిపిస్తే నీ కోసం చూస్తా అని అన్నారు. ఆరోజు చిరంజీవి(Chiranjeevi) గారు ఇచ్చిన ప్రశంసే నన్ను 400 సినిమాల్లో నటించేలా చేసింది. ఆయన రుణం ఈ జన్మలో తీర్చుకోలేను’ అని రఘుబాబు ఎమోషనల్ అయ్యారు.


కాగా, ఈ బ్రహ్మ ఆనందం సినిమాలో రాజా గౌతమ్‌ (Raja Goutham) హీరోగా నటించారు. ప్రియ వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్, వెన్నెల కిశోర్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఫిబ్రవరి 14న బాక్సాఫీసు ముందుకు రానుంది.

Next Story