- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘సినిమా చూసి ఎవరూ మారరు’.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్
‘సినిమా చూసి ఎవరూ మారరు’.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్

దిశ, వెబ్‌డెస్క్: శివాజీ(Shivaji), నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బింధు మాధవి, రాధ్య, అదితి భావరాజు తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న దండోరా చిత్రం(Dandora Movie) డిసెంబర్ 25న గ్రాండ్‌గా విడుదల అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు మురళీకాంత్(Muralikanth) ప్రమోషన్స్‌లో వేగం పెంచారు. తాజాగా ఈ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సినిమా చూసి ఎవరో మారిపోతారని నేను నమ్మను. ఒక అనుభవాన్ని చెప్పటమే సినిమా. అమెరికాలో ఉన్న వాడికి ఊర్లల్లో ఏం జరుగుతుందో తెలిసే అవకాశం ఉండదు.. అలాగే హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగినోడికి ఊర్లలో ఫంక్షన్స్ ఎలా జరుగుతాయనేది కూడా తెలిసి ఉండదు.. ఈ లైఫ్ స్టైల్‌ను వాళ్ల ఎక్స్‌పీరియెన్స్‌లో ఫేస్ చేయకపోవచ్చు. ఈ సినిమాను థియేటర్‌లోకి వచ్చి చూసినప్పుడు ‘ఓహో ఊరు ఇలా ఉంటుందా? ’ అనే చిన్న ఎక్స్‌పీరియెన్స్ కచ్చితంగా వస్తుంది. అలా ప్రతీ అభిమాని ఒక కొత్త విషయం తెలుసుకుంటే చాలు అని దర్శకుడు మురళీకాంత్ చెప్పుకొచ్చారు.






