Salman Khan: ‘మహాభారతం’ సినిమాతో వచ్చేస్తున్న మరో స్టార్ హీరో.. నెట్టింట పోస్ట్ వైరల్

by Chukka Sudharani |

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) ఇటీవల ‘సికందర్’ (Sikandar) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Salman Khan: ‘మహాభారతం’ సినిమాతో వచ్చేస్తున్న మరో స్టార్ హీరో.. నెట్టింట పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) ఇటీవల ‘సికందర్’ (Sikandar) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎఆర్ మురుగదాస్ (AR Murugadoss) దర్శకత్వం వహించిన ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా.. సత్యరాజ్, కాజల్ అగర్వాల్, శర్మన్ జోషి తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించి మెప్పించారు. ఇక రిలీజ్‌కు ముందే ప్రమోషనల్ కంటెంట్‌(Promotional content)తో ఈ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ కాగా.. భారీ అంచనాల మధ్య మార్చి 30న థియేటర్‌లలో రిలీజైంది. ఇక మొదటి షోతోనే యావరేజ్ టాక్ తెచ్చుకున్న చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయంపాలైంది. దీంతో సల్మాన్ తీవ్ర నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.

తర్వాత చేసే సినిమాలతో అయినా తమ స్టార్ హీరో హిట్ కొడతాడా? లేడా? అని సందిగ్ధంలో మునిగిపోయారు. ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌(Next Project)పై ఓ ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. అమీర్ ఖాన్ ఈ సంవత్సరం తన కలల ప్రాజెక్ట్ ‘మహాభారతం’ (Mahabharat) సినిమాను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇది ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ స్థాయిలో బహుళ భాగాల ఇతిహాసం అవుతుందని బాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం. చరిత్రలోనే ఇది అతిపెద్ద ప్రాజెక్టులలో ఒకటి నిలుస్తుందని తెలుస్తుండగా.. ఇంకా నటీనటులు అండ్ దర్శకత్వం ఖరారు కాలేదు. దీనిపై త్వరలో అధికారిక ప్రకటనతో పాటు ఫుల్ డిటైల్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.




Next Story