- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆగిపోయింది అనుకున్న సినిమా మళ్లీ స్టార్ట్.. ఫుల్ ఖుషీలో హీరో ఫ్యాన్స్
హీరో గోపీచంద్, డైరెక్టర్ కుమార సాయి కాంబినేషన్‌లో ఆగిపోయింది అనుకున్నా సినిమా మళ్లీ స్టార్ట్ కాబోతున్నట్లు టాక్.

దిశ, సినిమా: గత కొంతకాలంగా వరుస పరాజయాలు చవిచూస్తున్న మ్యాచో స్టార్ గోపిచంద్ ప్రజెంట్ ఒక సాలిడ్ హిట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకోగా.. ఇప్పుడు తన తదుపరి చిత్రంపై ఫోకస్ పెట్టాడు. డెబ్యూ డైరెక్టర్ కుమార సాయి దర్శకత్వంలో గోపీచంద్ 2025లో ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం గ్రాండ్‌గా లాంచ్ అయినప్పటికీ.. కొన్ని అనివార్య కారణాల చేత ఆగిపోయింది.
ఇక ఈ సినిమా పూర్తిగా ఆగిపోయిందని భావించారు. కానీ తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా అనౌన్స్ చేసిన నిర్మాణ సంస్థ నుండి రాబోతున్న నాగచైతన్య చిత్రం ‘వృషకర్మ’ షూటింగ్ పూర్తి కావడంతో.. మేకర్స్ ఇప్పుడు గోపీ చంద్ సినిమాపై ఫోకస్ పెట్టారట. దీంతో ఆగిపోయిన ఈ ప్రాజెక్టు ఇప్పుడు మళ్లీ పట్టాలెక్కడానికి సిద్ధమైందని తెలుస్తుండగా.. తాజా షెడ్యూల్ విదేశాల్లో ప్లాన్ చేశారు మేకర్స్. ఈ సంవత్సరం చివరి వరకు షూటింగ్ పనులు పూర్తి చేసుకుని 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన న్యూస్ వైరల్ అవుతుండగా.. ఆగిపోయింది అనుకున్న ప్రాజెక్టు మళ్లీ స్టార్ట్ కావడంతో గోపీ చంద్ అభిమానులు ఖుష్ అవుతున్నారు.






