- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Chiyan Vikram: రెండు రోజుల క్రితమే సినిమా రిలీజ్.. అప్పుడే నెక్ట్స్ మూవీకి సిద్ధమైన స్టార్ హీరో.. టైటిల్ కూడా ఫిక్స్!
కోలీవుడ్ (Kollywood) స్టార్ చియాన్ విక్రమ్ (Chiyan Vikram) రీసెంట్‌గా తన 62వ చిత్రం ‘వీర ధీర శూరన్-2’

దిశ, సినిమా: కోలీవుడ్ (Kollywood) స్టార్ చియాన్ విక్రమ్ (Chiyan Vikram) రీసెంట్‌గా తన 62వ చిత్రం ‘వీర ధీర శూరన్-2’ (Veera Dheere Sooran-2)తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అరుణ్ కుమార్ (Arun Kumar) దర్శకత్వం వహించిన ఈ మూవీలో దుషారా విజయన్ హీరోయిన్‌గా నటించగా.. ఎస్‌జే సూర్య, సురాజ్ వెంజరమూడు, సిద్ధిక్ తదితరులు కీలక పాత్రలో కనిపించి మెప్పించారు. రిలీజ్‌కు ఈ మూవీ నుంచి ప్రతి అప్‌డేట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా.. భారీ అంచనాల మధ్య ఈ మోస్ట్ వెయిటెడ్ మూవీ మార్చి 27న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో విక్రమ్ యాక్టింగ్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉంటే.. ‘వీర్ ధీర శూరన్-2 చిత్రం రిలీజైన రెండు రోజులకే.. విక్రమ్ తన నెక్ట్స్ సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్ (Interesting buzz) నెట్టింట వైరల్ అవుతోంది.
విక్రమ్ అప్పుడు తన 63వ సినిమాకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి మడోన్ అశ్విన్ (Madonne Ashwin) దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తుండగా.. ఈ మూవీ షూటింగ్ మే రెండవ వారం నుంచి చెన్నైలో స్టార్ట్ కానుంది. అలాగే ఈ సినిమాకు ‘వీరమేజయం’ (VeeraMeJayam) అనే టైటిల్ పెట్టడానికి చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతుండగా.. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు టాక్. కాగా ఈ మూవీ తర్వాత ‘వీర ధీర శూరన్ పార్ట్ 1’ షూటింగ్ ప్రారంభం కానుందని టాక్.
- #Chiyaan63 is directed by #MadonneAshwin. The shooting of this film is scheduled to begin in Chennai in the second week of May.
— Movie Tamil (@MovieTamil4) March 28, 2025
- Negotiations are underway to title this film as #VeeraMeJayam.
- After this film, the shooting of #VeeraDheeraSooran Part 1 will begin.
As per… pic.twitter.com/RaNloKFcv3






