ఇండిపెండెన్స్ డే స్పెషల్.. కేవలం రూ. 50 కే సినిమా అంటూ బంపర్ ఆఫర్ ప్రకటించిన స్టార్ హీరో

by Chukka Sudharani |

కామెడీ అండ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘సితారే జమీన్ పర్’(Sitare Zameen Par).

ఇండిపెండెన్స్ డే స్పెషల్.. కేవలం రూ. 50 కే సినిమా అంటూ బంపర్ ఆఫర్ ప్రకటించిన స్టార్ హీరో
X

దిశ, సినిమా: కామెడీ అండ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘సితారే జమీన్ పర్’(Sitare Zameen Par). బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్(Aamir Khan), డైరెక్టర్ ఆర్.ఎస్ ప్రసన్న కుమార్(Director R.S. Prasanna Kumar) కాంబినేషన్‌లో వచ్చిన ఈ మూవీని ఆమిర్ ఖాన్, అపర్ణ పూరోహిత్ నిర్మించారు. భారీ అంచనాలు మధ్య జూన్ 20న వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. అలాగే.. ఓటీటీలో కాకుండా డైరెక్ట్‌గా యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు చిత్ర బృందం. పే-పర్-వ్యూ (రూ.100) మోడల్‌లో ఆగస్టు 1వ తేదీ నుంచి ఈ సినిమా ప్రేక్షకులకు అందుబాటులోకి రాగా.. తాజాగా మరో బంపర్ ఆఫర్ ప్రకటించాడు ఆమిర్ ఖాన్.

ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఇండిపెండెన్స్ డే(Independence Day) స్పెషల్‌గా సితారే జమీన్ పర్ సినిమాను కేవలం రూ. 50లకే ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఈ ఆఫర్ కేవలం రెండు రోజులు మాత్రమే. ఆగస్టు 15 నుంచి 17 వరకు మాత్రమే ఇది వర్తిస్తుంది అంటూ వీడియోలో తెలిపాడు ఆమిర్.

Next Story