‘అఖండ-2’లో సరైనోడు విలన్.. బోయపాటి గట్టిగానే ప్లాన్ చేశాడుగా అంటున్న ఫ్యాన్స్

by Kavitha |
‘అఖండ-2’లో సరైనోడు విలన్.. బోయపాటి గట్టిగానే ప్లాన్ చేశాడుగా అంటున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా: పద్మ భూషణుడు, నందమూరి బాలకృష్ణ(Balakrishna) ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా రీసెంట్‌గా ‘డాకు మహారాజ్’(Daaku Maharaj ) సినిమాతో మనముందుకు వచ్చి.. బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ బాబీ కొల్లి(Bobby Kolli) తెరకెక్కించిన ఈ మూవీలో.. ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal), శ్రద్ధా శ్రీనాథ్(shraddha Srinath) హీరోయిన్లుగా నటించగా.. ఊర్వశి రౌతేలా(urvasi Rautela) ఐటెం సాంగ్‌లో చిందులేసింది. ఇక సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sitara Entertainments) బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ(Suryadevara Naga Vamsi), సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం బాలయ్య బాబు ‘అఖండ-2’(Akhanda-2) లో నటిస్తున్న సంగతి తెలిసిందే. 2021లో వచ్చిన యాక్షన్ ఎంటర్‌టైనర్ , బ్లాక్ బస్టర్ మూవీ అయినటువంటి ‘అఖండ’(Akhanda) సినిమాకు సీక్వెల్‌గా ‘అఖండ-2’ తెరకెక్కుతుండగా ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకులు ఈ చిత్రం కోసం ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇక బోయపాటి శ్రీను(Boyapati Srinu) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ సంయుక్త మీనన్(Samyuktha Menon) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమాని బాలయ్య రెండో కూతురు తేజస్విని(Tejaswini) సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట(Ram Achanta), గోపీ ఆచంట(Gopi Achanta)లు తెరకెక్కిస్తున్నారు.

కాగా ఇక ఈ సినిమాకు తమన్(Thaman) సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక ‘అఖండ- 2’ దసరా కానుకగా సెప్టెంబర్ 25న రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ స్టార్ట్ అయింది. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమాలో మరో యంగ్ హీరో, విలక్షణ యాక్టర్ ఆది పినిశెట్టి కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా అన్నపూర్ణ సెవెన్ ఎకెర్స్ సెట్‌లో ‘అఖండ 2’ యాక్షన్ సీన్స్ జరుగుతున్నది.

అయితే సీక్వెన్స్ షూటింగ్‌లో ఆది పినిశెట్టి జాయిన్ అయ్యాడట. ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్(Ram- Laxman) నేతృత్వంలో తెరకెక్కుతున్న ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌లో ఆది కూడా కనిపిస్తాడని తెలుస్తోంది. కాగా ఇది ఆది కెరీర్‌లోనే మోస్ట్ ఇంపాక్ట్ క్యారెక్టర్స్‌లో ఒకటిగా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. బోయపాటి అఖండ-2ను గట్టిగానే ప్లాన్ చేశాడుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్.

Next Story