ప్రేమ జంట మధ్యలోకి పోలీస్ ఆఫీసర్ ఎంట్రీ

by Chukka Sudharani |   (  Updated:2025-11-12 13:03:10  IST  )

ప్రేమ జంట మధ్యలోకి పోలీస్ ఆఫీసర్ ఎంట్రీ
X

దిశ, సినిమా: ‘కలర్ ఫొటో’ ఫేమ్ సందీప్ రాజ్(Director Sandeep Raj) దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘మోగ్లీ’(Mowgli). రోషన్ కనకాల( Roshan Kanakala), సాక్షి మడోల్కర్(Sakshi Madolkar) జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్‌ను సొంతం చేసుకోగా.. తాజాగా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘కొన్ని కథలు చెప్పడానికే ఉంటాయి.. ఇది అనుభూతి చెందడానికి.. ఒక నిశ్శబ్ద ప్రేమకథలోని అత్యంత పెద్దా వార్‌ను అనుభవించడానికి సిద్ధంగా ఉండండి’ అంటూ షేర్ చేసిన ఈ టీజర్‌లో ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్లే యువకుడిగా రోషన్ కనకాల కనిపించి మెప్పించాడు.

ఇక అతడు ప్రేమించే అమ్మాయిగా సాక్షి మడోల్కర్ అలరించనుంది. ఇలా అడవి నేపథ్యంలో సాగే వీరి క్యూట్ ప్రేమ కథలో రావణుడి లాంటి ఓ పోలీస్ ఆఫీసర్ ఎంట్రీ ఇవ్వడం ఆసక్తిని క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే తనకు ఎదురయ్యే సమస్యలను హీరో ఎలా ఎదుర్కొంటాడు.. తన ప్రేమను ఎలా గెలిపించుకుంటాడు అనే దానిపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొంది. మొత్తంగా ఈ టీజర్‌తో సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది. కాగా.. భారీ అంచనాల మధ్య ఈ మూవీ డిసెంబర్ 12న రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది.

Next Story