- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ileana: మానసికంగా, శారీరకంగా నన్ను నేను సిద్ధం చేసుకోవాలి.. రీఎంట్రీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన హీరోయిన్
‘దేవదాసు’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఇలియానా.

దిశ, సినిమా: ‘దేవదాసు’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఇలియానా. అనతికాలంలోనే హీరోయిన్‌గా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. అల్లు అర్జున్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే.. ప్రస్తుతం వెండితెరకు దూరంగా ఉంటున్న ఈమె తన ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ తల్లి బాధ్యతలు నిర్వర్తిస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఇలియానా తన సెకండ్ ఇన్నింగ్‌పై అప్డేట్ ఇచ్చింది.
‘సినిమాల్లోకి రావడానికి నేను తొందరపడటం లేదు. ప్రస్తుతం నా ఇద్దరు పిల్లలకు నేను అవసరం. వాళ్లను జాగ్రత్తగా చూసుకోవడంలో నేను బిజీగా ఉన్నాను. కానీ రీఎంట్రీ అయితే ఉంటుంది. అభిమానులు, ప్రేక్షకులు నన్ను ఎంతో మిస్ అవుతున్నారు. నేను కూడా నా కెరీర్‌లో ఎంతో గొప్పవారితో వర్క్ చేశాను. మరోసారి ఇండస్ట్రీకి వచ్చి అలాగే అలరించాలని ఉంది. నటన అంటే నాకెంతో ఇష్టం.. తెరపై కనిపించడం, భిన్నమైన పాత్రలు చెయ్యడం, సెట్లో అందరితో సందడిగా గడపడం ఇవన్నీ నేను కూడా మిస్ అవుతున్నాను. కానీ, దేనికైనా సమయం రావాలి. ఏ పని చేసిన దానికి పూర్తిగా న్యాయం చేయాలంటే.. ముందు దానిపై పూర్తిగా దృష్టి పెట్టాలి. అందుకే రీఎంట్రీ ఇచ్చేముందు మానసికంగా, శారీరకంగా కూడా నన్ను నేను సిద్ధం చేసుకోవాలి. దానికి కొంత సమయం పడుతుంది’ అని తెలిపింది. ప్రజెంట్ ఇలియానా కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.






