- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Good Bad Ugly: నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపిన ఇళయరాజా.. కారణం ఏంటంటే?

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar), డైరెక్టర్ ఆధిక్ రవిచంద్రన్ (Adhik Ravichandran) కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly). ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటించగా.. అర్జున్ దాస్, ప్రియా ప్రకాష్ వారియర్ కీలక పాత్రలో కనిపించారు. రిలీజ్‌కు ముందుకు ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా.. భారీ అంచనాల మధ్య ఈ మూవీ ఏప్రిల్ 10న థియేటర్స్‌లోకి వచ్చింది. ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు ఓ సమస్య వచ్చినట్లు టాక్. గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాన్ని తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో రిలీజ్ చేసినట్లు తెలుస్తుండగా.. తాజాగా ఆ నిర్మాతలకు ఇళయరాజా (Ilaiyaraaja) లీగల్ నోటీసులు పంపినట్లు టాక్. ఈ సినిమాలో తన పాటలను అనధికారికంగా ఉపయోగించుకున్నందుకు ₹5 కోట్లు నష్టపరిహారం కోరుతూ ఇళయరాజా గుడ్ బ్యాడ్ అగ్లీ నిర్మాతలకు లీగల్ నోటీసు పంపినట్లు తమిళ వర్గాల నుంచి సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో హాట్ హాట్‌గా వైరల్ అవుతున్నాయి.
I was pretty sure they used the audio company route (may be, they didn’t even do that). #Ilaiyaraaja is not part of IPRS, and so you are required to get a NOC from the composer. This was expected. https://t.co/DDDxAuzqV7 https://t.co/nTRBA4axsa
— Sylvian (@Sylvianism) April 15, 2025
#Ilaiyaraaja has reportedly sent a legal notice to #GoodBadUgly makers, seeking ₹5 CRORE for alleged unauthorized use of his songs. pic.twitter.com/i1OhqhvnJu
— Gulte (@GulteOfficial) April 15, 2025