IIFA Awards 2025: ఐఫాలో హవా.. ఏకంగా 10 అవార్డులు కైవసం చేసుకున్న సినిమా

by Chukka Sudharani |

భారతీయ సినీ పరిశ్రమ (Indian film industry)లో ఎంతో విశేషంగా భావించే ఐఫా అవార్డుల (IIFA Awards) వేడుక ఘనంగా జరిగింది.

IIFA Awards 2025: ఐఫాలో హవా.. ఏకంగా 10 అవార్డులు కైవసం చేసుకున్న సినిమా
X

దిశ, సినిమా: భారతీయ సినీ పరిశ్రమ (Indian film industry)లో ఎంతో విశేషంగా భావించే ఐఫా అవార్డుల (IIFA Awards) వేడుక ఘనంగా జరిగింది. పింక్ సిటీ జైపూర్ (Pink City Jaipur) వేదికగా రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం అలరించింది. శని, ఆది వారాల్లో జరిగిన ఈ ఈవెంట్‌ (event)లో మొదటి రోజు ఐఫా డిజిటల్ అవార్డు (IIFA Digital Award)లను ప్రదానం చేశారు. ఇక రెండో రోజు చలనచిత్ర అవార్డులు (Film Awards) ప్రదానం చేశారు. ఇందులో ‘లాపతా లేడీస్’ (laapataa ladies) సినిమా సంచలనం సృష్టించింది. ఏకంగా 10 అవార్డులను తన ఖాతాలో వేసుకుని సత్తా చాటింది. ‘ఉత్తమ చిత్రం’గా అవార్డు రావడంతో పాటు మరో 9 విభాగాల్లో ఐఫా అవార్డులను సొంతం చేసుకుంది.

చలనచిత్ర అవార్డుల విజేతలు..

ఉత్తమ చిత్రం: లాపతా లేడీస్

ఉత్తమ నటుడు – కార్తీక్ ఆర్యన్ (భూల్ భూలయ్యా 3)

ఉత్తమ నటి – నితాన్షి గోయెల్ (లాపతా లేడీస్)

ఉత్తమ దర్శకురాలు – కిరణ్ రావు (లాపతా లేడీస్‌)

ఉత్తమ దర్శకుడు (తొలి పరిచయం) – కునాల్ కేము (మడ్గావ్ ఎక్స్‌ప్రెస్)

ఉత్తమ విలన్‌ – రాఘవ్ జుయల్ (కిల్‌)

ఉత్తమ సహాయ నటుడు – రవి కిషన్‌ (లాపతా లేడీస్‌)

ఉత్తమ సహాయ నటి – జాంకీ బోడివాలా (షైతాన్)

ఉత్తమ నటి (తొలి పరిచయం) – ప్రతిభా రంతా (లాపతా లేడీస్)

ఉత్తమ నటుడు (తొలిపరిచయం) – లక్ష్య (కిల్)

ఉత్తమ నేపథ్య గాయని – శ్రేయా ఘోషల్

ఉత్తమ నేపథ్య గాయకుడు – జుబిన్ నౌటియల్

ఉత్తమ సంగీత దర్శకుడు – రామ్ సంపత్ (లాపతా లేడీస్)

ఉత్తమ సాహిత్యం – ప్రశాంత్ పాండే (లాపతా లేడీస్‌)

ఉత్తమ కథ (ఒరిజినల్‌) – బిప్లబ్ గోస్వామి (లాపతా లేడీస్)

ఉత్తమ కథ (అనువాదం) – శ్రీరామ్ రాఘవన్ (మేరీ క్రిస్మస్‌)

స్పెషల్ ఎఫెక్ట్స్ (విజువల్స్‌) – రెడ్ చిల్లీస్ VFX (భూల్ భూలయ్యా 3)

బెస్ట్ ఎడిటింగ్ – జబీన్ మర్చంట్ (లాపతా లేడీస్)

ఉత్తమ కొరియోగ్రఫీ – బోస్కో-సీజర్ (బాడ్ న్యూజ్ : తౌబా తౌబా)

ఉత్తమ సినిమాటోగ్రఫీ – రఫీ మహమూద్ (కిల్‌)

ఉత్తమ డైలాగ్స్ – అర్జున్ ధావన్, ఆదిత్య ధర్, ఆదిత్య సుహాస్ జంభలే, మోనాల్ థాకర్ (ఆర్టికల్ 370)

ఉత్తమ స్క్రీన్‌ప్లే - స్నేహ దేశాయ్‌ (లాపతా లేడీస్‌)

ఉత్తమ సౌండ్ మిక్సింగ్ – సుబాష్ సాహూ, బోలోయ్ కుమార్ డోలోయ్, రాహుల్ కర్పే (కిల్)

ఉత్తమ సౌండ్ డిజైన్ – సుబాష్ సాహూ (కిల్)

ఇక లాపతా లేడీస్ సినిమా విషయానికి వస్తే.. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ప్రోడక్షన్‌లో ఆయన మాజీ భార్య కిరణ్ రావ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. 2001లో సాగే కథ ఇది. పల్లెప్రాంతానికి చెందిన ఇద్దరు పెళ్లికూతుళ్లు రైలు ప్రయాణంలో అనుకోకుండా తారుమారు అవుతారు. ఆ తర్వాత వాళ్లు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది కథ. గతేడాది మార్చిలో వచ్చిన ఈ మూవీ బాక్సీఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. సుప్రీం కోర్టు ఆవిర్భవించి 75 ఏళ్లు అయిన సందర్భంగా కోర్టు అడ్మినిస్ట్రేట్ వేడుకల్లోనూ ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. అంతే కాకుండా ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను సైతం ‘లాపతా లేడీస్’ చిత్రం కైవసం చేసుకుంది.

Next Story