- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిజాయితీగా కష్టపడితే దేవుడు సక్సెస్ ఇస్తాడు.. హీరో శ్రీ విష్ణు కామెంట్స్ వైరల్
నిజాయితీగా కష్టపడి సినిమా చేస్తే దేవుడు సక్సెస్ ఇస్తాడు అంటున్నాడు హీరో శ్రీ విష్ణు.

దిశ, సినిమా: నిజాయితీగా కష్టపడి సినిమా చేస్తే దేవుడు సక్సెస్ ఇస్తాడు అంటున్నాడు హీరో శ్రీ విష్ణు. అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటించిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా లేటెస్ట్‌గా థియేటర్స్‌లో రిలీజై ఘన విజయాన్ని దక్కించుకుంది. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ అంటూ ప్రేక్షకులు, క్రిటిక్స్ ఈ సినిమాకు ప్రశంసలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర సక్సెస్ సెలబ్రేషన్స్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో శ్రీ విష్ణు, డైరెక్టర్ బాబీ ముఖ్య అతిథులుగా పాల్గొని సినిమాపై ప్రశంసలు కురిపించారు.
డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ.. ‘ఒక సినిమాతో ఇలా టీమ్ అంతా ఎమోషనల్‌గా కనెక్ట్ కావడం ఫస్ట్ టైమ్ చూస్తున్నా. అరగంట కదా అని ఈ ఈవెంట్‌కు వచ్చాను కానీ వీళ్లందరి చూస్తుంటే నేను వెళ్లాల్సిన ఫ్యామిలీ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకున్నా. వేణు అంటే నాకు చాలా ఇష్టం. ఆయనను చూస్తుంటే నాకూ ప్రొడ్యూసర్ కావాలని ఉంది. డైరెక్టర్ సాయిలు అమీర్ పేట ఛాలెంజ్ చేసినప్పుడు ఒక సాటి డైరెక్టర్ గా భయమేసింది. కానీ ఈ రోజు సాయిలు బాక్సాఫీస్ బద్దలు కొట్టే సక్సెస్ ఇచ్చాడు. అఖిల్, తేజస్వినీ మరిన్ని మంచి మూవీస్ చేయాలి. చైతన్యకు మంచి ఫ్యూచర్ ఉంది. ఈ సినిమా చూడండి అని చెప్పాల్సిన పని లేదు. ఈ వేదిక మీద కనిపిస్తున్న ఆనందమే విజయాన్ని చూపిస్తోంది’ అన్నారు.
హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. ‘మనం నిజాయితీగా కష్టపడి పనిచేస్తే విజయాన్ని దేవుడు తప్పకుండా అందిస్తాడు. ఈ టీమ్‌కు కూడా అలాంటి సక్సెస్ అందించాడు. ఈ యంగ్ టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొనడం నాకొక హ్యాపీ మూవ్మెంట్. దేవుడు మనుషుల రూపంలోనే మనకు హెల్ప్ చేస్తుంటాడు. మా కెరీర్ బిగినింగ్‌లో ఎవరు హెల్ప్ చేసినా దేవుడిగా భావించేవాళ్లం. ఇప్పుడు నెలకో కంటెంట్ ఉన్న చిన్న సినిమా రిలీజ్‌కు తీసుకొస్తూ వంశీ నందిపాటి, బన్నీ వాస్ అలాంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రెడబిలిటీ వంశీ, బన్నీ వాస్‌కు లైఫ్‌లో చాలా హెల్ప్ అవుతుంది. ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాకు పనిచేసిన టీమ్ మెంబర్స్ అందరికీ పేరు పేరునా నా శుభాకాంక్షలు అందిస్తున్నా. మట్టిలో నుంచి పుట్టిన కథలు వేణు దగ్గర చాలా ఉన్నాయి. ఆయన డైరెక్షన్ చేసుకుంటూనే సాయిలు లాంటి చాలామంది కొత్త డైరెక్టర్స్‌తో సినిమాలు చేయించాలని కోరుకుంటున్నా. వేణు దగ్గర ఉన్న కథలు మన ఇండస్ట్రీకి చాలా అవసరం’ అని తెలిపారు.






