150 ఏళ్లు బతకడం ఎలాగో నాకు తెలుసు.. నన్ను రాష్ట్ర సీఎంను చేస్తే ఆ సీక్రెట్ రివీల్ చేస్తా.. స్టార్ హీరో సంచలన కామెంట్స్

by Sujitha Rachapalli |   (  Updated:2025-06-03 13:30:58  IST  )

ఒకప్పటి స్టార్ హీరో శరత్ కుమార్ ప్రస్తుతం కీలకపాత్రల్లో కనిపిస్తున్నాడు. తను చేసిన పాత్రలకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసే ఆయనకు వారసురాలిగా వరలక్షీ శరత్ కుమార్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

150 ఏళ్లు బతకడం ఎలాగో నాకు తెలుసు.. నన్ను రాష్ట్ర సీఎంను చేస్తే ఆ సీక్రెట్ రివీల్ చేస్తా.. స్టార్ హీరో సంచలన కామెంట్స్
X

దిశ, ఫీచర్స్ : ఒకప్పటి స్టార్ హీరో శరత్ కుమార్ ప్రస్తుతం కీలకపాత్రల్లో కనిపిస్తున్నాడు. తను చేసిన పాత్రలకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసే ఆయనకు వారసురాలిగా వరలక్షీ శరత్ కుమార్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అందరి హీరోల కూతుర్ల మాదిరిగా కేవలం హీరోయిన్‌గా మాత్రమే స్టిక్ ఆన్ కాకుండా కంటెంట్ ఉన్న క్యారెక్టర్లకు ఓకే చెప్తూ వస్తోంది. నటిగా ప్రూవ్ చేసుకుంటుంది. ఈ మధ్యే కూతురికి పెళ్లి చేసిన ఆయన బాధ్యత కూడా తీర్చుకున్నాడు. ఇదంతా పక్కన పెడితే శరత్ కుమార్ హ్యూమన్ లైఫ్ స్పాన్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మనిషి ఆయుర్దాయం పడిపోతుందని నిపుణులు చెప్తున్నారు. 60ఏళ్లు ఆరోగ్యంగా బతకడం కష్టమనే అభిప్రాయం వచ్చేసింది. కానీ శరత్ కుమార్ మాత్రం తాను 150 ఏళ్లు కచ్చితంగా బతుకుతానని చెప్తున్నాడు. ఒకవేళ 2026లో తనను సీఎం చేస్తే ఆ సీక్రెట్ రివీల్ చేస్తానని తెలిపాడు. ఇక దీనిపై స్పందిస్తున్న జనాలు.. 149 ఏళ్లు బతికి అప్పుడు అడుగు చూద్దాం అని కామెంట్ చేస్తున్నారు. పెద్ద జోక్ వేశావ్.. అయినా నిన్నెందుకు సీఎం చేయాలి.. బతికి ఇతరులకు తలనొప్పిగా మారే బదులు తొందరగా ఎగ్జిట్ కావడమే మంచిదని సూచిస్తున్నారు.

Next Story