- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రేమిస్తే కచ్చితంగా మారతారు.. ఎట్టకేలకు లవ్ పై స్పందించిన రష్మిక.. ఇండైరెక్ట్‌గా హింట్ ఇచ్చేసిందిగా..
ప్రస్తుతం రష్మిక(Rashmika Mandanna) వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం రష్మిక(Rashmika Mandanna) వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్ స్టార్ ఆయుష్మాన్ ఖురానా(Ayushman Khurana)తో కలిసి 'థామా'(Thaama) అనే హారర్ కామెడీ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే 'ది గర్ల్‌ఫ్రెండ్'(The Girlfriend) అనే సినిమాలో కూడా నటిస్తున్నారు. తాజాగా 'మైసా' అనే మరో ప్రాజెక్ట్‌ను కూడా ప్రకటించారు. ఈ సినిమాలతో పాటు ప్రముఖ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి ఓ భారీ ప్రాజెక్ట్‌లో కూడా రష్మిక నటించనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రేమ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
నిజ జీవితంలో యానిమల్‌లో హీరో పాత్ర స్వభావం ఉన్న వ్యక్తితో మీరు డేటింగ్ చేస్తారా.. అతడిలో మార్పు తీసుకురాగలరా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు రష్మిక స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. ‘మనం ఎవరినైనా ప్రేమిస్తే.. మనల్ని ఎవరైనా ప్రేమిస్తే మార్పు కచ్చితంగా జరుగుతుందని నేను నమ్ముతాను. ఎందుకంటే భాగస్వామితో కలిసి ఉంటున్నప్పుడు వారితో కలిసి జీవితాన్ని పంచుకుంటున్నప్పుడు ఇద్దరి వ్యక్తిత్వాల్లో మార్పు వస్తుంది. ఒకరికి ఒకరు అభిప్రాయాలు పంచుకుంటారు.
ఇష్టాయిష్టాలు తెలుసుకుంటారు. ఒకరి కోసం ఒకరు మారుతారు. మీ ప్రాణ స్నేహితుడితో కానీ మీ భాగస్వామితో కానీ కొంతకాలం కలిసి ప్రయాణించాక అకస్మాత్తుగా పాత రోజులను గుర్తు చేసుకుంటే వారి కోసం మీరు ఎంతలా మారారో అర్థమవుతుంది. ఆ మార్పునకు ఒక్కోసారి మీరే ఆశ్చర్యపోతారు’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారగా.. విజయ్‌పై ఉన్న తన ప్రేమను ఇలా ఇండైరెక్ట్‌గా చెప్పేసిదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.






