- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రేమించి మోసం చేస్తే పుట్టగతులు ఉండవు.. సర్వ నాశనం అయిపోతారు.. అలనాటి హీరోయిన్ సంచలన కామెంట్స్
అలనాటి హీరోయిన్ ఇంద్రజ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: అలనాటి హీరోయిన్ ఇంద్రజ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో అనేక సినిమాల్లో నటించి మెప్పించింది. అలాగే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది. ప్రజెంట్ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తోంది. మరోపక్క శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షోకు జడ్జ్‌గా వ్యవహరిస్తుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ జబర్దస్త్ వర్ష హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న కిస్సిక్ టాక్ షోలో పాల్గొని తన కెరీర్, లైఫ్, పెళ్లికి సంబంధించిన పలు విషయాలు పంచుకున్నారు. ఇందులో భాగంగా ప్రేమ, బ్రేకప్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
ఒకరు మనల్ని మోసం చేశారు అన్నప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందని యాంకర్ వర్ష అడగ్గా.. దానికి ఇంద్రజ స్పందిస్తూ.. “నార్మల్ డెలివరీ ఇచ్చేటప్పుడు వచ్చే పెయిన్ హయ్యస్ట్ బాధ అంటారు కదా.. అంతకు సమానంగా ఉండే పెయిన్ ఏదైనా ఉందంటే అది ప్రేమలో మోసపోవడమే. అది చేసినవాళ్లు ఆడదైనా మగవాడైనా సరే వాళ్లకు పుట్టగతులు ఉండవు అంతే.. సర్వ నాశనం అయిపోతారు. మీరు పుట్టింది ప్రేమించడానికి కాదు.. సాధించడానికి. టాలెంట్ ఉంటేనే సినీరంగంలో నిలదొక్కుకుంటాం. లక్ ఉంటేనే సక్సెస్ అవుతాం” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట సెన్సేషనల్‌గా మారాయి.






